E-Paper
Advertisement

యూపీలో దారుణం.. బైక్‌ను ఢీకొట్టి.. ఒంటిపై నుంచి కారు ఎక్కించి..

యూపీలో దారుణం..  బైక్‌ను ఢీకొట్టి.. ఒంటిపై నుంచి కారు ఎక్కించి..
Advertisement

Aligarh Hit Run: డబ్బు ఉంటే చట్టం చుట్టం అవుతుందా? నడిరోడ్డుపై ఏం చేసినా చెల్లుతుందా? ఈ విజువల్స్ చూడండి. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఏదో అనుకోకుండా జరిగిన ప్రమాదం కానే కాదు. కావాలనే కసితో, ప్లాన్‌ చేసి మరీ కారుతో ఢీకొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత కిందపడిన వారి దగ్గరకు వెళ్లాలి. లేదంటే భయంతో అక్కడి నుంచి పారిపోవాలి. కానీ అక్కడ జరిగింది వేరు. కిందపడి విలవిలలాడుతున్న వ్యక్తిపై నుంచి కనికరం లేకుండా కారు ఎక్కించారంటే ఇది మర్డర్ కాకుంటే ఏమవుతుంది.

హారన్ కొట్టాడని కారుతో తొక్కించి..

Advertisement

అక్టోబర్‌ 20న యూపీలోని అలీగఢ్‌లో స్వీట్‌ షాప్‌ రన్ చేసే మనోజ్‌ తన ఫ్రెండ్‌తో కలిసి నవ్వుతూ బైక్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలోనే వెనుక యమకింకరులు ఆడి కారు వేసుకొని దూసుకువచ్చారు. హారన్ విషయంలో మనోజ్‌తో గొడవ పడ్డారు. అక్కడితో ఆ గొడవ ఆగలేదు. బైక్‌పై వెళ్తున్న వారిని వెంబడించి మరీ కారుతో ఢీకొట్టారు. రోడ్డుపై పడిపోయిన మనోజ్‌పై నుంచి కారుతో దూసుకెళ్లారు. చుట్టుపక్కల వాళ్లు కారును ఆపేందుకు ప్రయత్నించినా.. ఆగకుండా జంప్ అయ్యారు. మనోజ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అతని ఫ్రెండ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు.

డబ్బు, పవర్ ఉంటే చట్టం చుట్టమవుతుందా?

Advertisement

ఇక్కడే అసలు సినిమా మొదలైంది. ఆ యాక్సిడెంట్‌కు కారణమైన ఆడి కార్ సాధారణమైనోడిది కాదు బాసూ.. అలీగఢ్ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి దేవరాజ్ సింగ్‌ది.. అధికార పార్టీ అండతో ఆ కిరాతకులు తప్పించుకోవాలని చూస్తున్నారని లోకల్‌లో టాక్ వినిపిస్తోంది. ఇది యాక్సిడెంట్ కాదు ముమ్మాటికీ ప్లాన్ చేసి మరీ చేసిన మర్డర్ అంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బన్నాదేవి పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు గానీ.. ప్రమాద సమయంలో ఆ కారు స్టీరింగ్ పట్టుకున్న ఆ హంతకుడు ఎవడనేది ఇప్పటికీ సస్పెన్సే

న్యాయం నిద్రపోతోందా?

కోపం అంత విలువైనదా? ఒక హారన్‌ అంత పెద్ద నేరమా? క్షణిక ఆవేశం కోసం ఓ మనిషి ప్రాణమే తీసేస్తే చట్టం ఊరుకుంటుందా? అధికార బలంతో ఆ హంతకులు తప్పించుకోవాలని చూస్తే.. న్యాయం నిద్రపోదు.. మనోజ్ ఆత్మ శాంతించదు.

Also Read: శంషాబాద్‌లో హవాలా గుట్టు రట్టు.. కోటి 56 లక్షల విదేశీ కరెన్సీ సీజ్!

Tags

Related News

జామియా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులు, గార్డుల మధ్య ఘర్షణ.. తరగతులు ఆన్‌లైన్‌కు మళ్లింపు!

ర్యాపిడో డ్రైవర్ ముసుగులో జైషే ఉగ్రవాది.. కస్టమర్లను ఎక్కించుకుంటూ.. పాక్‌తో కలిసి ఉగ్ర కుట్రలు!

‘అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు’.. చైనా వ్యూహంపై కేంద్ర మంత్రి సెటైర్లు!

చదువుకున్న స్కూల్‌లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!

కర్ణాటక ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. సీఎం డీకే శివకుమార్ సంచలన విషయాలు వెల్లడి!

ప్రపంచ శాంతికి వేదిక యూఎన్.. అయినా యుద్ధాలు ఎందుకు ఆగడం లేదు?

చిరిగిన రూ.10 నోటు వివాదం.. డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడి.. అవమానంతో యువకుడు సూసైడ్!

Big Stories

Advertisement
×