E-Paper
Advertisement

2027 Sankranthi: సంక్రాంతి బరిలో పవన్-సూరి బొమ్మ ఉంటే.. అంతా సర్దేసుకోవాల్సిందేనట!

2027 Sankranthi: సంక్రాంతి బరిలో పవన్-సూరి బొమ్మ ఉంటే.. అంతా సర్దేసుకోవాల్సిందేనట!
Advertisement

2027 Sankranthi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండుగ అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల జాతర. అయితే 2027 సంక్రాంతి (2027 Sankranthi) మాత్రం ఇప్పటివరకు చూడని ఒక భారీ ఫైట్‌కి వేదిక కాబోతోంది. దీనికి కారణం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK), టేకింగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న తాజా లీకులు చూస్తుంటే, పవన్ ఈసారి పక్కాగా బాక్సాఫీస్ ‘డైనోసార్’లా వేటాడటం ఖాయమనిపిస్తోంది. సురేందర్ రెడ్డి (Surender Reddy) అంటేనే మనకు ‘రేసుగుర్రం’, ‘కిక్’ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలు గుర్తొస్తాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం ఆయన సిద్ధం చేసిన కథ చాలా బలంగా ఉందని.. యాక్షన్, ఎనర్జీ పరంగా ఇది ‘రేసుగుర్రం’ స్థాయిని మించి ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో పవన్‌ను సురేందర్ రెడ్డి ప్రెజెంట్ చేసే విధానం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుందట. అందుకే, ఈ బొమ్మ గనుక సంక్రాంతి బరిలో ఉంటే.. మిగతా సినిమాలు తమ డేట్స్ మార్చుకోవాల్సిందే అనేలా చర్చ మొదలైంది.

Also Read- Niharika: ‘ప్రొడ్యూసర్ గారి తాలూకా’.. అయ్యబాబోయ్, నిహారిక కూడా వాడేస్తుంది!

సంక్రాంతి 2027 లిస్ట్ ఇదే..

Advertisement

ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ మూవీ వాస్తవానికి అక్టోబర్‌లోనే రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉండటంతో, అది డిసెంబర్ చివరికి లేదా సంక్రాంతి రేసులోకి వచ్చే ఛాన్స్ ఉందట. ఒకవేళ అన్నదమ్ములిద్దరూ పండుగ బరిలో తలపడితే అది హిస్టారిక్ క్లాష్ అవుతుంది. ఇంకా 2027 సంక్రాంతి మీద చాలా మందే కన్నేశారు. వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రంతో.. అనిల్‌ తన సంక్రాంతి సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్ తర్వాత బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబో మరోసారి పండుగ వేట కోసం రెడీ అవుతోంది. ఇంకా కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో శర్వానంద్ – శ్రీను వైట్ల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Also Read- Roshan Meka: వైలెంట్ దర్శకుడితో లవ్ స్టోరీ చేయనున్న రోషన్ మేకా.. హీరోయిన్ ఎవరంటే..!

పొలిటికల్ ఎమర్జెన్సీ ఏర్పడితే డౌటే..

Advertisement

ఇంత మంది పోటీలో ఉన్నా, పవన్ – సూరి కాంబినేషన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయితే మాత్రం సీన్ మారిపోతుంది. కథలోని స్ట్రెంత్, పవన్ కళ్యాణ్ మేనియా చూస్తుంటే.. ‘‘మిగతా వారు డ్రాప్ అయిపోవడం మంచిది’’ అనే రేంజ్‌లో వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. 2027 సంక్రాంతికి పవర్ స్టార్ తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నాడన్నమాట. మరి ఈ డైనోసార్ ధాటికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చూడాలి. కాకపోతే, పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం, షూటింగ్ ముగించుకోవడం వంటి విషయాలను బట్టి రిలీజ్ ఉంటుంది. అవి కరెక్ట్‌గా సాగితే మాత్రం సంక్రాంతి బరిలో పక్కాగా పవన్-సూరి కాంబోని ఊహించుకోవచ్చు. మధ్యలో ఏదైనా పొలిటికల్ ఎమర్జెన్సీ ఏర్పడితే మాత్రం.. కష్టమే. చూడాలి మరి, ఏం జరుగుతుందో?

Also Read- Manchu Lakshmi: గ్రీన్ పార్క్ హోటల్‌లో మంచు లక్ష్మికి ఘోర అవమానం.. అసలేం జరిగిందంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×