E-Paper
Advertisement

Niharika: ‘ప్రొడ్యూసర్ గారి తాలూకా’.. అయ్యబాబోయ్, నిహారిక కూడా వాడేస్తుంది!

Niharika: ‘ప్రొడ్యూసర్ గారి తాలూకా’.. అయ్యబాబోయ్, నిహారిక కూడా వాడేస్తుంది!
Advertisement

Niharika: ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ ఆ మధ్య ఏ రేంజ్‌లో హడావుడి నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు, జనసేన కార్యకర్తలు అంతా తమ వెహికల్స్‌పై స్టిక్కర్లతో యమా హడావుడి చేశారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఏమనుకుందో ఏమో.. నిహారిక (Niharika) కూడా ఇప్పుడదే రూట్‌ని ఫాలో అవుతోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మిస్తోన్న మూవీ ‘రాకాస’ (Rakasa). ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో నిహారిక ‘ప్రొడ్యూసర్ గారి తాలూకా’ అంటూ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్నంగా ప్రారంభించారు. ‘ప్రొడ్యూసర్ గారి తాలూకా’ ఎపిసోడ్ 1గా వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గమనిస్తే..

Also Read- ETV Prabhakar: క్షమించండి.. నా కొడుకుది తప్పే! అంటూనే.. మళ్లీ ఇదేంటి?

ఈ పిల్లల్ని చూసుకునే సంత ఏంటిరా?

Advertisement

సెట్‌లో ఓ ‘జూనియర్ ఆర్టిస్ట్’ తనని అలా పిలవద్దని, తను ఈ సినిమాలో మెయిన్ ఆర్టిస్ట్ అని, పైగా ‘ప్రొడ్యూసర్ గారి తాలూకా’ అని బిల్డప్ ఇస్తుంటాడు. డైరెక్టర్ ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలో కూడా తనే చెప్తానని, సెట్‌లో అందరినీ తన ఓవరాక్షన్‌తో విసిగిస్తుంటాడు. డైరెక్టర్ మాన‌స శ‌ర్మ‌ తనని ఫ్రేమ్ ఇన్, ఇన్ అంటూ చివరికి ఫ్రేమ్ అవుట్ చేసేస్తుంది. ఈ అతిని భరించలేక నిహారిక కొణిదెల (ప్రొడ్యూసర్) ఎంట్రీ ఇస్తుంది. తనని ఫ్రేమ్ పెట్టడం కాదు కదా, ఫ్రేమ్ లోంచి అవుట్ చేస్తున్నారని నిర్మాతతో చెప్పుకుంటాడు. ఇక అతనికి యాక్టింగ్ రాదని తెలుసుకున్న నిహారిక, పోని అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తావా? అంటే అమ్మో ఆ దుమ్ములో మనవల్ల కాదని అంటాడు. సరే మార్కెటింగ్ చేస్తావా? అంటే నాకు రాదుగా అంటాడు. ఎవరికి వచ్చు.. చాట్ జీపీటీ (ChatGPT), జెమిని (Gemini) లాంటి AI టూల్స్ ఉన్నాయిగా అని నిహారిక అంటుంది. అయితే మంచి మార్కెటింగ్ ప్లాన్‌తో వస్తానంటూ జూనియర్ ఆర్టిస్ట్ లేచి వెళ్లిపోతాడు. ‘ఈ పిల్లల్ని చూసుకునే సంత ఏంటిరా? బాబు’ అని నిహారిక తలపట్టుకుంది. వాడికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని సెట్‌లోని వేరే అతను అంటే.. సినిమా కథ మొత్తం తనకి తెలుసని, అతను బయటకు వెళ్లి ఆ స్టోరీని ఫిలిం నగర్ అంతా చెప్పేస్తాడేమో అనే భయంతోనే అతన్ని సెట్ చుట్టూ ఏదో ఒక పని ఇస్తూ తిప్పుకుంటున్నామని నిహారిక రివీల్ చేస్తుంది. ఇది ఈ వీడియోలో ఉన్న మ్యాటర్.

Also Read- Romantic Movie OTT : విజయ్ దేవరకొండ హీరోయిన్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి… అయితే ఒక చిన్న ట్విస్ట్

ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్

Advertisement

‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల‌తో న‌టుడిగా మెప్పించిన సంగీత్ శోభ‌న్ తొలిసారి సోలో హీరోగా ఇందులో న‌టిస్తున్నారు. మాన‌స శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ అన్ని మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. సంగీత్ శోభ‌న్ సోలో హీరోగా త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో న‌వ్విస్తూ మెప్పించ‌బోతున్నాడ‌నే ఎగ్జయిట్‌మెంట్‌తో అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే.

Also Read- Manchu Lakshmi: గ్రీన్ పార్క్ హోటల్‌లో మంచు లక్ష్మికి ఘోర అవమానం.. అసలేం జరిగిందంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×