E-Paper
Advertisement

Cockroach: రాజమౌళి ‘ఈగ’తో.. ఈయన బొద్దింకతో సినిమా.. పిల్లల్ని చూడొద్దంటున్నారు!

Cockroach: రాజమౌళి ‘ఈగ’తో.. ఈయన బొద్దింకతో సినిమా.. పిల్లల్ని చూడొద్దంటున్నారు!
Advertisement

Cockroach: దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ‘ఈగ’ (Eega)ను పెట్టి సినిమా తీసి సక్సెస్ కొట్టారు. అప్పటి నుంచి దోమని పెట్టి సినిమా తీయండి అంటూ సరదాగా కామెంట్స్ పడుతుంటాయ్. కానీ ఇప్పుడో దర్శకుడు ఏకంగా ‘బొద్దింక’ పేరుతో సినిమా చేశారు. అయితే ఇదేదో రాజమౌళి తరహాలో కేవలం ఈగని బేస్ చేసుకుని తీసిన సినిమా కాదని తెలుస్తోంది. సమాజం చీత్కరించుకొనే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథతో ‘కాక్రోచ్’ అనే టైటిల్‌తో పి. సునీల్ కుమార్ రెడ్డి (P Sunil Kumar Reddy) సినిమా చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ శనివారం అధికారికంగా తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- ETV Prabhakar: క్షమించండి.. నా కొడుకుది తప్పే! అంటూనే.. మళ్లీ ఇదేంటి?

విడుదలకు సిద్ధం..

Advertisement

అడ్డురోడ్‌లో పడుపు వృత్తి చేసుకొనే వేశ్యకి, ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహమే ‘కాక్రోచ్’ (Cockroach) అని అంటున్నారు చిత్ర బృందం. భ్రష్టు పట్టిన అవినీతి సమాజపు చీకటి‌ని పరిచయం చేసే చిక్కటి చిత్రమని, కాక్రోచ్‌ని చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే ద్వంద విలువల మనస్తత్వాలని ప్రశ్నించే పాత్రలతో దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి. బాపిరాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో..

Also Read- Family Drama OTT : పిల్లల కోసం ఆపసోపాలు… దత్తత తీసుకుని పడరాని పాట్లు… ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

సున్నిత మనస్కులు, పిల్లలు ఈ సినిమా చూడొద్దు

Advertisement

మా ‘కాక్రోచ్‌’ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. సున్నిత మనస్కులు, పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శక నిర్మాతలు సవినయంగా పత్రికాముఖంగా కోరారు. చిత్రాన్ని మార్చి మొదటి వారం‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా వారు ఈ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రంలో ఉన్న హింసాత్మక పోరాటాలను సహజంగా చూపించడానికి రియల్ ఫైటర్స్‌ని నటులు‌గా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్‌లు నిజజీవిత ఆధారిత కిరాయి హంతకులుగా నటించగా.. ‘సొంతవూరు’ చిత్రంలో ఉత్తమ నటి అవార్డు గ్రహీత ‘తీర్థ’ ఒక ముఖ్య పాత్ర ఇందులో పోషించారు. మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేష్ వంటివారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. మరి రాజమౌళికి ‘ఈగ’ హిట్ ఇచ్చినట్లుగా పి. సునీల్ కుమార్ రెడ్డికి ఈ ‘బొద్దింక’ హిట్ ఇస్తుందో, లేదో తెలియాలంటే మాత్రం మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read- Manchu Lakshmi: గ్రీన్ పార్క్ హోటల్‌లో మంచు లక్ష్మికి ఘోర అవమానం.. అసలేం జరిగిందంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×