IBomma Ravi on Kingdom Vijay Warning:ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ నెల 5న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లు కొత్త సినిమాలు పైరసీ చేస్తూ ఇండస్ట్రీని, పోలీసు శాఖకు కంటిమీద కునుకులేకుండ చేశాడు. ఎంతోకాలంగా అతడిపై నిఘా పెట్టిన పోలీసులు నవంబర్ ప్రారంభంలో అతడిని అరెస్ట్ చేశారు. దాదాపు అతడిపై 5 కేసలో నమోదవ్వగా.. నిన్నటితో రెండు కేసుల్లో కస్టడీ ముగసింది.
ఇంకా అతడి బ్యాంక్ లావాదేవీలు, పైరసీలో ఎవరెవరూ ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తుల్లో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టాడు. అయితే తాను తప్పుచేశానని ఒప్పుకుంటూ పోలీసుల ఎదుట ఇమ్మడి పశ్చాత్తాపడినట్టు సమచారం. ఈ విచారణలో రవి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చారు. అలాగే కింగ్ డమ్ మూవీ టైంలో విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇచ్చిన అంశంపై కూడా పోలీసులు ఇమ్మడి రవిని విచారించగా అసలు నిజం బయపెట్టాడట.
కాగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ విడుదలైన 24 గంటల్లోనే ఆ మూవీ ఆన్ లైన్ లో లీకైంది. హెచ్ డీ ప్రింట్ తో బప్పం, ఐబొమ్మ సైట్లోనూ దర్శనం ఇచ్చింది. అప్పుడే ‘మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మేము మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని.. ఎప్పుడో చెప్పాం‘ అంటూ ఐబొమ్మ సైట్ లో ఓ నోట్ విడుదల చేశారు. అయితే అప్పుడు ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించే పెట్టారని అర్థమైంది. కానీ, ఇది నిజమా? లేక ఏదో సరదాగా పెట్టారా? అనేది క్లారిటీ లేదు. తాజాగా పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఆ హెచ్చరిక నిజమే అని, విజయ్ దేవరకొండను ఉద్దేశించి తానే హెచ్చరిస్తూ ఆ నోట్ పెట్టానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడట.
ఈ విషయాన్ని నిన్న ఇచ్చిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. కింగ్ డమ్ మూవీకి ముందు విజయ్ ఖుషీ మూవీ చేశాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన గంటల వ్యవధిలో ఐబొమ్మ, బప్సం సైట్లోకి వచ్చింది. అది కూడా హెచ్ డీ ప్రింట్ తో. అప్పటికే మూవీ యావరేట్ టాక్ తెచ్చుకుని ఫలితం ఏమౌతుందనే టెన్షన్ లో ఉన్న టీంకి సినిమా పైరసీ మరింత బాధించింది. దీంతో హీరో విజయ్ స్వయంగా రంగంలోకి దిగి పైరసీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం, పోలీసులకు రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ముఖ్యంగా ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకోవాలంటూ తన పోస్ట్ లో ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఆ పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఐబొమ్మ నుంచి విజయ్ దేవరకొండకు వార్నింగ్ వచ్చింది.
Also Read: Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకాలో ఆ సీన్ నిజంగా జరిగింది, పవన్ కళ్యాణ్ కోసం అరటి పళ్ళు తీసుకెళ్లిన దర్శకుడు
‘మా మీద ఫోకస్ చేస్తే.. మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది‘ అంటూ వెబ్ సైట్లో ఓ నోట్ పెట్టారు. కింగ్ డమ్ టైంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. అయితే ఐబొమ్మ అప్పుడు స్టేట్మెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసిందా లేదా.. మరేదైనా ఫేక్ సైట్ చేసిందా అనేది క్లారిటీ లేదు. దీనిపై ఎన్నెన్నో అనుమానాలు ఉండేవి. అయితే ఆ వార్నింగ్ తానే ఇచ్చినట్టు నిన్నటి కస్టడీ విచారణలో ఇమ్మడి రవి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడట. ‘మా మీద ఫోకస్ చేస్తే.. మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని మా టీమ్ ముందే చెప్పింది. కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. మా పేరుతో ఐ బొమ్మ ఎఫ్ ఎఫ్ డాట్ ఇన్ పేరుతో రన్ చేస్తున్నారు అందుకే మీ కింగ్ డమ్ సినిమా బయటకు తెస్తాం‘ అని రవి అప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులు బహిర్గతం చేసిన ప్రకటనలో ఉంది.