E-Paper
Advertisement

Women in Stress: ఏడువేల మంది భార్యలపై స్డడీ.. సర్వేలో షాకింగ్ విషయాలు, భర్తల వల్లే తీవ్ర ఒత్తిడి!

Women in Stress: ఏడువేల మంది భార్యలపై స్డడీ.. సర్వేలో షాకింగ్ విషయాలు, భర్తల వల్లే తీవ్ర ఒత్తిడి!
Advertisement

Women in Stress: వివాహం.. అనేది ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ, విశ్వాసం, భావోద్వేగాల సమ్మేళనం మాత్రమే కాదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని.. దాంపత్య జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా భార్యభర్తల మీద ఉంటుంది. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి. ఒకరి సమస్యలను ఒకరితో పంచుకోగలిగేలా మెలగాలి. తాజాగా భార్యలపై చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. భార్యల్ని పిల్లల కంటే భర్తలే ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తున్నారట. ఇదే విషయాన్ని సర్వే చేసి మరీ నిర్ధారించింది ఓ వెబ్‌సైట్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం..

భర్తల వల్లే అధిక ఒత్తిడి:

ఇటీవల 7వేల మంది తల్లుల మీద చేసిన ఓ స్టడీలో పిల్లల కంటే భర్తలే భార్యల్ని ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తున్నారని తేలింది. ఈ స్టడీలో పాల్గొన్న భార్యల్ని ‘మీరు దేనివల్ల ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు? ఇంటి బాధ్యతల వల్లనా.. భర్త లేదా పిల్లల వల్లనా?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు 46% మంది మా పిల్లల కంటే.. మా భర్తల వలనే అధికంగా ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. ఆ ఒత్తిడి యావరేజ్‌గా పదిలో 8.5గా ఉందని సర్వేలో తేలింది.

Advertisement

Read Also: విడాకులు తీసుకునే ముందు.. ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ ప్రయత్నించండి!

సమస్యను చర్చించుకోవాలి:

మీ భర్త వల్ల మీకు ఒత్తిడిగా అనిపిస్తుంటే.. ఈ విషయాన్ని నేరుగా మీ భర్తతో చర్చించడమే సరైన సొల్యూసన్. ఎందుకంటే.. అధిక ఒత్తిడి మీ ఆరోగ్యం, మీ పనుల మీద ప్రభావం చూపుతుంది. వాటిలో ఇంటికి అవసరమైన సరుకులు కొనడం, వంటపాత్రలు కడగటం, వంట చేయడం, పిల్లల చదువులో సాయం చేయడం వంటి ఇంటి పనులు చాలానే ఉంటున్నాయి. ఇలాంటి పనులను దంపతులు ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. అప్పుడే ఆరోగ్యంతో పాటు మీ వివాహ బంధం కూడా హెల్దీగా ఉంటుంది.

ప్రతి ఐదుగురిలో ఒకరికి:

Advertisement

ఈ సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు ఇంటి పనులన్నీ చేసుకోవడంతో పాటు.. పిల్లల బాగోగులు కూడా చూసుకోవాల్సి వస్తోందని చెప్పారు. అయితే.. ప్రతి ఐదుగురిలో ఒకరికి భర్త నుంచి సరైన సాయం అందకపోవడమే కాకుండా.. సమయానికి పని పూర్తి చేయడంలేదని భర్తలు పిర్యాధులు చేస్తున్నారట. దీంతో తల్లులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాదు.. ఒంటరి తల్లులతో పోలిస్తే భర్తతో కలిసి ఉన్న మహిళలకే ఒత్తిడిస్థాయి ఎక్కువగా ఉంటోందని చెబుతోంది ఈ సర్వే.

Read Also: పిల్లల్ని మురికి డైపర్లతోనే ఉంచేస్తున్నారా.. దీర్ఘకాలిక వ్యాధుల్ని ఎదుర్కోవాల్సిందే అంటున్న నిపుణులు!

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×