Andhra King Taluka: ‘రారా కృష్ణయ్య‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. వాస్తవానికి సందీప్ కిషన్ హీరోగా వేరే కథను చేద్దాం అనుకున్నాడు దర్శకుడు. అయితే చివరి నిమిషంలో కథలో మార్పులు జరగడం వలన అధికాస్త రారా కృష్ణయ్య అయిపోయింది.
ఆ సినిమా అయిపోయిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు పాటు సరైన అవకాశాలు మహేష్ బాబుకి రాలేదు. కొన్ని వచ్చినా కూడా ఆ వాటిని వర్కౌట్ చేయలేదు. అయితే మొత్తానికి మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు మహేష్ బాబు. నవీన్ పోలిశెట్టి అనుష్క నటించిన ఆ సినిమా విపరీతమైన ప్రశంశాలు అందుకోవడం తోపాటు అద్భుతమైన కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక రీసెంట్గా మహేష్ బాబు చేసిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.
ఈ సినిమాలో రామ్ పోతినేని ఉపేంద్రకు వీరాభిమాని. అతని సినిమాలను విపరీతంగా చూస్తూ ఉంటాడు. అతని క్షేమం కోరుకుంటాడు. ఒక హీరోని అభిమానులు ఎలా ఇష్టపడతారు. తమ అభిమాన నటుడి కోసం ఎంతో దూరమైన వెళతారనేదాన్ని ఓ సీన్లో క్లియర్ గా చూపించాడు మహేష్ బాబు. అయితే ఒక సీన్ లో తన అభిమాన నటుడికి అరటి పళ్ళు ఇష్టమని రామ్ పోతినేని చాలా కష్టపడి కొంత పడవ ప్రయాణం చేసి మరి అరటిపళ్ల గెలను తీసుకువెళతాడు. అయితే దీని వెనక ఒక ఆసక్తికరమైన నిజమైన కథ ఉంది.
Also Read: Dil Raju: పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ కన్ఫాం, 2017 మళ్లీ రిపీట్ అవుతుంది..
ప్రజారాజ్యం పార్టీ టైంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చారట. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక హోటల్లో బస చేస్తుంటే, లోకల్ ఎమ్మెల్యే పిఏ తో దర్శకుడు మహేష్ బాబు ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారు. అతనికి భోజనం తీసుకెళ్లి ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారట. వెంటనే నేను వెళ్తాను అని మహేష్ బాబు భోజనం పట్టుకుని వెళుతున్న టైం లో అతనికి అరటిపళ్ళు అంటే ఇష్టమని చెప్పారట. వైజాగ్ అంతా తిరిగిన తర్వాత ఒక షాపు దగ్గర అరటి పళ్ళు ఉన్నాయి. అవి చాలా చివరిగా ఉన్నాయి. అయితే వాటిని తక్కువ రేట్ కి ఇచ్చేద్దామని పళ్ళు అనే వ్యక్తి అనుకున్నాడు.
కానీ అవి పవన్ కళ్యాణ్ తింటున్నారు అని జేబులో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఇచ్చేసి ఆ పళ్ళు తీసుకున్నారట మహేష్ బాబు. అవి నేను పవన్ కళ్యాణ్ కి ఇచ్చాను తర్వాత తిన్నారో లేదో నాకు తెలియదు అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.మహేష్ బాబు చదువుకుంటున్న టైం నుండే పవన్ కళ్యాణ్ కు అభిమాని. ఆ తరువాత సినిమా మీద ఎక్కువ ప్రేమ ఉండడంతో దర్శకత్వ మీద మక్కువ కలిగింది. డైరెక్షన్ మీద ఇష్టం వచ్చినప్పుడు ప్రతి సినిమాని కూడా ఇష్టంగా చూడడం మొదలుపెడతాం. అదే తరహాలో ఇప్పుడు మహేష్ బాబు అన్ని సినిమాలు కూడా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాడు.