Vijay Devarakonda: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తాజాగా నటించిన రణబాలి సినిమా(Ranabaali movie) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శక నిర్మాతలతో పాటు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)రష్మిక మందన్న(Rashmika Mandanna) కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ రణబాలి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా తాను చెప్పిన మాట నేడు నిజమైందని తెలిపారు. రణబాలి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుందని, ఇప్పుడు అది నిజమైందని తెలియజేశారు. ఒక నటుడికి ఎన్ని సినిమాలు చేసినా, ప్రేక్షకులు ఎప్పటికీ మాట్లాడుకునే సినిమాలు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో రణబాలి సినిమా ఉంటుందని మరో పాతికేళ్లు గడిచినా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇక రణబాలి సినిమా చేసే సమయంలో మేము మంచి హిట్ కొట్టాలి, వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి అని చేసింది కాదని తెలిపారు.
ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా చెప్పాలని మాత్రమే నిర్ణయించుకున్నామని విజయ్ దేవరకొండ తెలిపారు. రణబాలి సినిమా ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే సినిమా అని, ఈ సినిమాకు మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ఇక ఈ సినిమా నిన్న మొదటిసారి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి చూసాము అయితే అమ్మ మాత్రం ఈ సినిమా చూసి ఎక్కి ఎక్కి ఏడ్చిందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలిపారు.
విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో నటిస్తున్న సినిమాలన్నింటికీ కూడా పెద్దగా ఆదరణ లేదని చెప్పాలి చాలా సంవత్సరాల తర్వాత విజయ్ రణబాలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి తర్వాత నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పరిపాలనలో రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి తెలియజేస్తూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నేడు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: చిరంజీవితో మల్టీస్టారర్.. కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున!