Big TV Bus Tour: ఏపీలో ఇప్పటికే స్థానిక సంస్ధల రాజకీయ వేడి కాక రేపుతుంది. ఓ పక్క కూటమి నేతలు మరో పక్క వైసీపీ పార్టీ నాయకులు నామినేషన్లు వేస్తున్నారు. దీంతో నామినేషన్లు వేసే సమయంలో ఒకరిపై ఒకరు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతూ వేస్తున్నారు. అయితే ఏపీలో స్థానిక సమస్యలు ఎలా ఉన్నాయి. అక్కడి ప్రాంత ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు. ఎక్కువగా ఏ పార్టీపై మొగ్గు చూపుతున్నారో తెలుసుకోడానికి బిగ్ టీవీ ఓ అడుగు ముందుకేసింది. అక్కడి స్థానికులతో మాట్లాడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు బిగ్ టీవీ బస్సులో వెల్లి రిపోర్డును మనకు కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇందుకు మొదటగా కర్నూల్ జిల్లా ప్రాంత ప్రజల మనసులో ఏముంది. వారు ఏం కోరుకుంటున్నారో చూపించే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది.