E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : నాలుగైదు వారాల్లో బ్యాగు సర్దుకుని వచ్చేస్తాం అనుకున్న , సంజనా తో ఆది పినిశెట్టి వైఫ్

Bigg Boss 9 Telugu : నాలుగైదు వారాల్లో బ్యాగు సర్దుకుని వచ్చేస్తాం అనుకున్న , సంజనా తో ఆది పినిశెట్టి వైఫ్
Advertisement

Bigg Boss 9 Telugu : ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో ప్రత్యేకమైన సినిమాలు చేశాడు. ఆ తర్వాత కాలంలో నిక్కీ గర్లని ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిక్కీ గర్లానీ మరెవరో కాదు స్వయాన సంజన గర్లానీ సిస్టర్. సంజన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు బుజ్జిగాడు సినిమాతోనే మంచి గుర్తింపు సాధించుకుంది. అయితే బిగ్బాస్ కి వెళ్లిన తర్వాత తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది.

మొదట్లో ఈమె ఆట తీరు చూసి త్వరగా బయటకు వచ్చేస్తుంది అని అందరు ఊహించారు కానీ తర్వాత తర్వాత చాలామంది మనుషులను సంజన గెలుచుకుంది. ఇక టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లిస్టులో కూడా సంజన చేరిపోయింది. ఈ తరుణంలో సంజనా సిస్టర్ నిక్కి తనకోసం ఒక స్పెషల్ వీడియో చేశారు. ఆ వీడియోను బిగ్ బాస్ హౌస్ లో ప్లే చేశారు.

నాలుగు వారాల్లో వచ్చేస్తావ్ అనుకున్న 

Advertisement

నిక్కీ మాట్లాడుతూ సంజనా మేమందరం బానే ఉన్నాము మేము నాలుగు వారాల్లో నువ్వు వచ్చేస్తావు అనుకున్నాము. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు నువ్వు టాప్ ఫైవ్ లో ఉన్నావు. ఇంట్లో వేరే పెళ్లి ఉండటం వలన నేను నీ ఫ్యామిలీ వీక్ కి రాలేకపోయాను. నువ్వు ఆడే విధానం చూసి మేము అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ముందు నుంచి నేను గమనిస్తుంటే నీ ఆటలో ఒక బ్యూటిఫుల్ గ్రాఫ్ ఉంది.

గత రెండు వారాలుగా మంచి ఎఫర్ట్స్ పెట్టి నీ గేమ్ ఆడావు. అలానే ఈ వీక్ కూడా బాగా ఆడాలి. ఫినాలే లో కలుద్దాం. అలానే ఇమ్మానుయేల్ మా అక్కతో అలానే మీ అమ్మతో గొడవ పడొద్దు అంటూ ఇమ్మతో కూడా మాట్లాడారు నిక్కి. ఆవిడ కోపంలో ఏదైనా చెప్పొచ్చు కానీ ఆమె మనసులో ఏమీ ఉండదు హౌస్ లో అందరికన్నా ఆవిడ నిన్ను మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతుంది అంటూ చెప్పింది నిక్కి. అలానే మిగతా కంటెస్టెంట్ లందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పింది నిక్కి.

సంజన ఫ్యాన్ బేస్ 

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో ప్రత్యేకత ఏంటి అంటే రోజులు గడుస్తున్న కొద్దీ వ్యక్తిత్వాలు అసలైన రంగుల అర్థమవుతాయి. మొదటి వారంలో గుడ్డు దొంగతనం చేసి కంటెంట్ ఇచ్చినా కూడా అప్పుడు చాలామంది ఆమెను తక్కువ అంచనా వేశారు. కానీ మొదటి కెప్టెన్ గా తను ప్రూవ్ చేసుకుంది. ఆ తరువాత ఎలిమినేట్ అయిపోయినట్లు చూపించి ఒక రూమ్ లో దాచటం అనేది బిగ్గెస్ట్ ట్విస్ట్.

ఏదేమైనా బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. అన్నిటిని మించి గేట్స్ తీసేస్తాం వెళ్ళిపో అంటే వెళ్లిపోతా సార్ అని బిగ్ బాస్ కి చెప్పిన వాళ్ళు తొమ్మిది సీజన్ లో ఎవరు కూడా లేరు. ఆ గట్స్ కేవలం సంజనకు మాత్రమే ఉన్నాయి అని ప్రూవ్ అయింది. అక్కడితోనే ఆమె మీద రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్ కు చాలా మందికి వెళ్లిపోయింది.

Also Read: The RajaSaab : త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రభాస్ రాజా సాబ్ ప్రీమియర్ షోలు పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×