Bigg Boss 9 Telugu Day 101 : వన్ మోర్ వన్ లాస్ట్ టైమ్ లో భాగంగా పోటీదారులకు చివరగా ఇచ్చిన టాస్క్ ‘తప్పిస్తే గెలుస్తావ్’. “ఈ చివరి టాస్క్ లో 100 శాతం ఇచ్చి, మీకున్న పట్టుదలను 100 శాతం కనబరుస్తారని ఆశిస్తున్నాను” అని బిగ్ బాస్ టాస్క్ షురూ చేశారు. ఇందులో ఒకరొకరు బాల్స్ అంటించకుండా చూసుకోవాలి. ఎవరి షర్ట్ కి ఎక్కువ బాల్స్ అంటుకుంటే వాళ్ళు అవుట్. అప్పటికే 4 స్టార్లు రావడంతో అందరూ కలిసి డెమోన్ ను టార్గెట్ చేశారు. అందులో సంజన కూడా ఉండడంతో “నిన్ను టార్గెట్ చేశానా అక్కా” అని సీరియస్ గా బాల్ ను విసిరికొట్టి వెళ్ళిపోయాడు. “నేను అసలు ఎటాక్ చేశానో లేదో నాకు తెలీదు” అని సమాధానం చెప్పింది సంజన. “అలాంటప్పుడు మాట్లాడకు. వాళ్ళు ముగ్గురూ ఎటాక్ చేస్తే చేస్తా అన్నావ్” అన్నాడు డెమోన్. “వాడు మా ముగ్గురిని టార్గెట్ చేశాడు. నేను కూడా టార్గెట్ చేశాను” అన్నది తనూజా.
ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఇమ్మూ టాప్ 4లలో ఒక్కొక్కరినీ పిలిచి జోస్యం చెప్పాడు. “జరిగింది జరగబోయేది మొత్తం చెప్తాను” అని భూతద్దం పట్టుకుని కూర్చున్నాడు ఇమ్మూ. సంజన వచ్చి కూర్చోగానే “55 సినిమాలు చేసి ఉంటారు కదూ. ఎలా చెప్పాను అనుకున్నారు? మీరే రోజుకు 10 సార్లు చెప్తారు. ఇది పోపు గొడవ రేఖ, ఇది దొంగతనం రేఖ, ఈ రేఖ వల్లే మీరు మధ్యలో బయటకు వెళ్లి మళ్ళీ వచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు. డెమోన్ వచ్చి కూర్చోగానే “ఆ చేతిలో రేఖలేవి? పత్తాపారాలు ఏం చేశావ్?” అని అన్నాడు. “నీ ఫ్యూచర్ నీ మీదే కాదు నీ పక్కన ఉన్నవాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే వాళ్ళిప్పుడు నీ పక్కన లేరు” అని డెమోన్ కు చెప్పుకొచ్చాడు. “ఈ రేఖ కళ్యాణ రేఖ. నీకు కాబోయే హస్బెండ్ కు ఉండబోయే లక్షణాలు చెప్తా విను. అందరిలాగా సిక్స్ ప్యాకులు ఉండవు, కానీ మంచి మనసు ఉంటది. లాంగ్ హెయిర్ ఉండదు కానీ మంచి గుణం ఉంటది” అని తనూజాకు చెప్పాడు. “ఇమ్మాన్యుయేల్ గురించి కాదు నాకు కాబోయే హస్బెండ్ గురించి చెప్పు” అంటూ తనూజా పంచ్ ఇచ్చింది. ఆ తరువాత కళ్యాణ్ రావడంతో “అది చెయ్యేనా?” అంటూ కళ్యాణ్ కు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇమ్మూ. తరువాత మోస్ట్ ఎనర్జిటిక్ ప్లేయర్ ఎవరు అని బిగ్ బాస్ అడిగితే… అందరూ కలిసి సంజనాకు ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ ఆమెకు సిస్టర్, హీరోయిన్ నిక్కీ గల్రాని నుంచి వచ్చిన వీడియో మెసేజ్ ను ప్లే చేశాడు. ఆమె ఇమ్మూను సంజనాతో గొడవ పడొద్దని రిక్వెస్ట్ చేసింది.
ఇమ్మాన్యుయేల్ ను గార్డెన్ ఏరియాకు పిలిచి సీజన్ మొత్తం అతను క్రియేట్ చేసుకున్న మెమోరీస్ ను చూపించారు. “ఇమ్మాన్యుయేల్ ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం నిండుగా, ఆసక్తికరంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టాలను స్వయంగా అనుభవించిన వారికి ఒక చిన్న చిరునవ్వు బలం ఎంతో బాగా తెలుస్తుంది. ఈ ఇంట్లో అదే మీ వరంగా ముందుకు సాగారు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసి పోయారు. నవ్వులైనా, నామినేషన్ అయినా మాటలే మీ ఆయుధాలు. తెలివితేటలు మీ గేమ్ ప్లాన్. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలనే విషయం ఈ ఇంట్లో మీకన్నా బాగా ఎవ్వరికీ తెలియదు. కమెడియన్ గా అడుగు పెట్టిన మీరు హీరోగా రావాలనే మీ అమ్మ కల నిజం అయ్యింది” అంటూ ఇమ్మాన్యుయేల్ ఏవీ వేశారు. “ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా” అంటూ ఇదంతా చూసిన ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు.
Read Also : నోరు తెరిస్తే బ్యాడ్ అవుతారేమోనని… కళ్యాణ్ గురించేనా… అర్థరాత్రి ఇదేం పని డెమోన్ ?