Jio Recharge: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో.. తాజాగా మరో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన ఈ కొత్త రూ.450 ప్లాన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకునే సమస్య లేకుండా కాస్త ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని జియో చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 36 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. నెల కంటే మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలో ప్లాన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని జియో వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ప్రతీ రోజూ 2GB డేటాతో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. అంతేకాకుండా అర్హులైన యూజర్లకు నాన్ స్టాప్ 5G డేటా సైతం లభించనుంది.
ఈ రూ.450 ప్లాన్ లో కాలింగ్, డేటాతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల కోసం ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ (JioHotstar) యాక్సెస్ కూడా చేర్చారు. దీనివల్ల యూజర్లు తమకు నచ్చిన సినిమాలు, షోలు, స్పోర్ట్స్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. అంతేకాకుండా 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ ఏఐ టూల్స్‌తో పాటు యూజర్లకు 50GB జియో ఏఐ క్లౌడ్ (JioAICloud) స్టోరేజ్ ప్రయోజనం కూడా అందనుంది.
Also Read: మొబైల్ చూస్తుంటే కళ్లలో మంట, దురద, ఎర్రబడ్డాయా? దీని వెనుక కారణాలు ఇవే
జియో ప్లాట్‌ఫామ్స్ తమ డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసే వ్యూహంలో భాగంగా ఈ తరహా వినూత్న ఆఫర్లను తీసుకువస్తోంది. ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటూ డిజిటల్, ఏఐ ఆధారిత సేవలను సామాన్యులకు చేరువ చేయడమే ఈ రూ.450 ప్లాన్ లాంచ్ ముఖ్య ఉద్దేశమని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ప్రైవేటు ఆసుపత్రిలో యనమలకు చికిత్స.. ఏమైంది? పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం