E-Paper
Advertisement

The RajaSaab: 23 కోట్ల ఫైట్ సీన్.. మొసళ్ల సీన్ వర్కౌట్ అయ్యిందా?

The RajaSaab: 23 కోట్ల ఫైట్ సీన్.. మొసళ్ల సీన్ వర్కౌట్ అయ్యిందా?
Advertisement

The RajaSaab:ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ది రాజాసాబ్. తన సినీ కెరియర్లో తొలిసారి హారర్ బ్యాక్ డ్రాప్ లో నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ఈ సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈమెతో పాటు నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే బాలీవుడ్ నటులు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ లాంటి భారీ తారాగణం భాగమైంది..

23 కోట్లతో ప్రభాస్ – మొసలి మధ్య ఫైట్ సీన్..

ఇదిలా ఉండగా ఈ సినిమా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో ప్రభాస్ – మొసలికి మధ్య వచ్చే ఫైట్ సీన్ మరో ఎత్తు. నిజానికి ఈ ఫైట్ సీన్ ను దర్శకుడు మొదట కొంత భాగం షూటింగ్ చేసి బడ్జెట్ ఎక్కువ కావడంతో ఈ సీను సినిమా నుంచి తొలగిద్దాం అనుకున్నారట. కానీ ప్రభాస్ పట్టుబట్టి మరి ఏకంగా తన రెమ్యూనరేషన్ లో తగ్గించుకోమని చెప్పి ఈ ఫైట్ సీన్ సినిమాలో ఉంచినట్లు సమాచారం. పైగా ఈ ఒక్క సీను కోసం ఏకంగా నిర్మాతలు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరి 23 కోట్ల రూపాయలు కేటాయించి సినిమాలో ఉంచిన ఈ సీన్ వర్కౌట్ అయ్యిందా అంటే అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఈ ఫైట్ సీన్ అదిరిపోయింది అంటే మరి కొంతమంది మేము ఊహించినంత రేంజ్ లో లేదు అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ మూవీ కాదు మొసళ్ల పండుగ..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు ట్రైలర్ లో ప్రభాస్ కి – మొసలికి మధ్య ఫైట్ సీన్ చూపించిన విషయం తెలిసిందే. ఇక ఆ సీన్ సినిమాలో వస్తుంది కాబట్టి దానిని రీ క్రియేట్ చేయడానికి కొంతమంది అభిమానులు ఏకంగా మొసళ్ల బొమ్మలు తీసుకొని థియేటర్లలో తెగ హంగామా చేశారు. క్లైమాక్స్ లో ప్రభాస్ మొసలితో ఫైట్ చేసే సన్నివేశం థియేటర్లో వచ్చే సమయంలో ఆ బొమ్మలను పట్టుకుని స్క్రీన్ వద్దకు వెళ్లి దానిని రీ క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రభాస్ ఏమో కానీ మొసలి మాత్రం భారీగా హైలైట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఫన్నీ మీమ్స్ , ఈ వీడియోలు చూసిన నెటిజన్లు “ఇది రాజాసాబ్ కాదు మొసళ్ల పండుగ” అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే అభిమానుల రీ క్రియేషన్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

also read:The RajaSaab 2: జోకర్ గా ప్రభాస్.. టైటిల్ తెలిస్తే షాక్!

రీ క్రియేషన్తో అభిమానులు రచ్చ..

Advertisement

ఇకపోతే అభిమానులు సన్నివేశాలను ఇలా రీ క్రియేట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సినిమాలలోని కొన్ని హైలైట్ అయిన పాత్రలను కూడా ఇలా రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×