E-Paper
Advertisement

The RajaSaab 2: జోకర్ గా ప్రభాస్.. టైటిల్ తెలిస్తే షాక్!

The RajaSaab 2: జోకర్ గా ప్రభాస్.. టైటిల్ తెలిస్తే షాక్!
Advertisement

The RajaSaab 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas ) తన సినీ కెరియర్ లో తొలిసారి హారర్ బ్యాక్ డ్రాప్ లో నటించిన చిత్రం ది రాజాసాబ్ (The RajaSaab). నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఎన్నో అంచనాల మధ్య ఎట్టకేలకు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అటు ప్రేక్షకులు ఇటు సినీ ఇండస్ట్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

జోకర్ గా ప్రభాస్.. పార్ట్ 2 టైటిల్ ఇదే..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంది. అయితే ఈ చిత్రానికి “రాజాసాబ్ సర్కస్ : 1935” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే ఇలాంటి టైటిల్ తెరపైకి రావడంతో ఇదేంటి అంటూ కొంతమంది తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇందులో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించబోతున్నారట. ఇకపోతే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా స్పష్టం చేశారు. సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ కి లీడ్ ఇస్తూ ప్రభాస్ జోకర్ లుక్ ను పరిచయం చేశారు. అయితే ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కావచ్చు అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఇక ట్రైలర్ లో చూపించిన ఎన్నో సన్నివేశాలు రాజాసాబ్ సినిమాలో చూపించలేదు. బహుశా అవన్నీ పార్ట్ 2 లో చూపించే అవకాశం ఉంది. పైగా ఈ పాత్రలన్నీ కూడా సీక్వెల్ లో కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

Advertisement

ఎంతో కాలంగా ఊరించి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజాసాబ్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమానే ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అంటే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పడంతో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సీక్వెల్ ను ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన త్వరలో స్పిరిట్ సినిమాను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.. ఈ చిత్రాలతో పాటు కల్కి సీక్వెల్ అలాగే సలార్ 2 చిత్రాలు కూడా లైన్లో పెట్టారు ప్రభాస్. మరి ఈ చిత్రాలన్నీ ఈయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి..

Advertisement

ALSO READ:Maa Inti Bangaram Teaser: సమంత ఈజ్ బ్యాక్.. అదరగొట్టేసింది భయ్యో!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×