E-Paper
Advertisement

AA22xA6: సైలెంట్ గా షూటింగ్..ఆ నెలే టార్గెట్ అంటున్న మేకర్స్!

AA22xA6: సైలెంట్ గా షూటింగ్..ఆ నెలే టార్గెట్ అంటున్న మేకర్స్!
Advertisement

AA22xA6:పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) ఇండియన్ బిగ్గెస్ట్ హీరోలలో ఒకరిగా మారిపోయాడు. పుష్ప సినిమా తర్వాత ఈయన బ్రాండ్ విలువ ఆకాశానికి తాకింది. నార్త్ ఇండస్ట్రీ మొత్తం పుష్ప మేనియా కొనసాగడంతో అల్లు అర్జున్ కి భారీ క్రేజ్ వచ్చింది. పుష్ప సినిమా నార్త్ లో భారీ హిట్ కొట్టడంతో అల్లు అర్జున్ నుండే ఆ తర్వాత వచ్చే సినిమాకి కూడా నార్త్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రజాదరణ దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్ అట్లీ తో తన నెక్స్ట్ మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ఈ మూవీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ఈ సినిమా షూటింగ్లో చాలా బిజీ బిజీగా ఉన్నారు.

శరవేగంగా షూటింగ్..

ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించారు. ముందుగా నిర్మాతలు తెర వెనుక ఒక చిన్న వీడియోని ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ గా పంచుకున్నారు. ఆ తర్వాత దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే సినిమా అయితే ప్రకటించారు కానీ ఈ మధ్యకాలంలో ఈ సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్లు ఏవి రావడం లేదు. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ అట్లీ తమ సినిమా షూటింగ్ ని చాలా సైలెంట్ గా స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మే నాటికి బన్నీ పార్ట్ షూట్ మొత్తం పూర్తయిపోతుందని తెలుస్తోంది.. అంతేకాదు అల్లు అర్జున్ మే నెలలో ఈ షూటింగ్ పూర్తి చేశాక నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో చేస్తారు అనే దానిపై డిస్కషన్లు కూడా మొదలు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నాయట. అల్లు అర్జున్ అట్లీ సినిమాకు సంబంధించి అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ బన్నీ అట్లీ సైలెంట్ గా సినిమా పూర్తి చేసి భారీ ఎత్తున సినిమా ప్రమోట్ చేయబోతున్నారని భావిస్తున్నారు.

ఫుల్ జోష్ లో ఫ్యాన్స్..

Advertisement

అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ రాకపోవడంతో సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఈ అప్డేట్ కు సంబంధించిన వార్త అల్లు అర్జున్ అభిమానులకి కొత్త ఊపునిస్తోంది. అల్లు అర్జున్ తన సినిమాల్ని చాలా కొత్తగా ప్రమోట్ చేసుకుంటారు. ఈ సినిమాను కూడా కొత్తగా భారీ ఎత్తున ప్రమోట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

రిలీజ్ పై క్లారిటీ?

అలా సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి భారీ ఎత్తున సినిమాని ప్రమోట్ చేయాలనే ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం. ఈ మధ్యనే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. అయితే ఈ సినిమా నుండి త్వరలోనే టీజర్ లేదా పోస్టర్ వస్తే సినిమాపై మరింత క్రియేట్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మరి చూడాలి అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి టీజర్ లేదా పోస్టర్,గ్లింప్స్ ఏవైనా రిలీజ్ చేస్తారా అనేది.. అయితే తాజాగా మే నాటికి బన్నీ పార్ట్ షూట్ అయిపోతే.. 2027 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

ALSO READ:Anasuya: SSMB 29 షూటింగ్ లొకేషన్ లో అనసూయ.. ఏకంగా వారితో కలిసి!

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×