E-Paper
Advertisement

మదర్స్ డే రోజున రోజా కూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అది గిఫ్ట్ కాదు!

మదర్స్ డే రోజున రోజా కూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అది గిఫ్ట్ కాదు!
Advertisement

Anshu Achievement: భారతీయ విద్యార్థిని అన్షు రోజా సెల్వమణి అమెరికాలో అరుదైన రికార్డును నెలకొల్పారు. ప్రతిష్టాత్మకమైన ఇండియానా యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ హానర్స్‌లో అత్యున్నత ప్రతిభను కనబరిచి, ఆ విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఒక అరుదైన అవార్డును అందుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారు.

Read also-Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు అవుట్..?

తొలి భారతీయ విద్యార్థిని

Advertisement

ఇండియానా యూనివర్సిటీ ప్రతీ ఏటా అత్యుత్తమ విద్యార్థులకు అందించే ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్ అవార్డు’ (Herman B Wells Distinguished Senior Award) ఈ ఏడాది అన్షును వరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ విద్యార్థినిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. అకడమిక్స్‌తో పాటు నాయకత్వ లక్షణాలను గుర్తించి ఇచ్చే ఈ పురస్కారం అన్షుకు దక్కడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అన్షు కేవలం ఒక అవార్డుతోనే ఆగకుండా, తన విద్యాభ్యాస కాలంలో అడుగడుగునా తన ముద్ర వేశారు. కంప్యూటర్ సైన్స్ హానర్స్‌లో అత్యుత్తమ గ్రేడ్‌లతో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. టెక్నాలజీ విభాగంలో సమానత్వం కోసం ఆమె చేసిన కృషికి ‘మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు’ దక్కింది. CEW&T సంస్థ నుండి 2026 సంవత్సరానికి గానూ ‘అవుట్‌స్టాండింగ్ స్టూడెంట్ లీడర్’ గుర్తింపు పొందారు. లుడ్డీ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు, పలుమార్లు డీన్స్ లిస్ట్ (Dean’s List) లో చోటు సంపాదించి ‘ఫౌండర్స్ స్కాలర్’గా నిలిచారు.

Advertisement

Read also-ఎన్టీఆర్ ఆ స్టైలిష్ లుక్ ఒరిజినల్ కాదా?.. మరీ దిగజారిపోతున్న పీఆర్ టీమ్..

మాతృదినోత్సవ వేళ అపురూప కానుక

ఈ అద్భుత విజయాలు తన తల్లికి మాతృదినోత్సవం సందర్భంగా అందించిన అత్యంత విలువైన కానుకగా నిలిచాయి. కుమార్తె సాధించిన విజయాలపై ఆమె తల్లి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. “కష్టపడి పని చేసే గుణం, క్రమశిక్షణ ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని నా కుమార్తె నిరూపించింది. ఒక తల్లిగా నాకు ఇంతకంటే మించిన గర్వకారణం ఏముంటుంది?” అని తన ఆనందాన్ని పంచుకున్నారు.

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×