Vijay – Rashmika: దాదాపు 8 సంవత్సరాలుగా రహస్యంగా ప్రేమాయణం సాగిస్తూ అభిమానులలో అంచనాలు పెంచేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) ఎట్టకేలకు ఫిబ్రవరి 26న రెండు మత సాంప్రదాయాల పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. ఇకపోతే కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో నో ఫోన్ పాలసీని పాటించిన విషయం తెలిసిందే. అందుకే అతిధులు ఎవరూ కూడా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను బయటకు విడుదల చేయలేదు. కానీ వివాహం అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ తమ ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఆ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఇకపోతే ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు అలా బయటకు వచ్చాయో లేదో కేవలం 12 గంటల్లోనే 2.6 కోట్ల లైక్స్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా వీరికి ఉన్న క్రేజ్ను బట్టి ఈ రేంజ్ లో లైక్స్ రావడం అరుదైన విషయంగా పరిగణించవచ్చు. ఇదిలా ఉండగా లక్ష్మీనారాయణుడిలా చాలా అందంగా అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి దుస్తుల్లో రాజసం ఉట్టిపడేలా హుందాతనంతో కనిపించి అందరినీ మెప్పించారు..
ఇకపోతే ఈ పెళ్లి వేడుకల్లో వీరు ధరించిన నగలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాయి. చాలా అందంగా అద్భుతంగా డిజైన్ చేసిన ఈ జ్యూవెలరీని ఎవరు తయారు చేశారు? వీటి తయారీకి ఎంతకాలం పట్టింది? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆధునిక డిజైన్స్ తో సాంప్రదాయ మేళవింపుతో ఈ ఆభరణాలను ప్రత్యేకంగా తమ వివాహానికి సిద్ధం చేయించుకుంది ఈ జంట. ముందుగా రష్మిక మందన్న ధరించిన నగల విషయానికి వస్తే.. శ్రీ జువెలర్స్ రూపొందించిన 11 రాచరికపు ప్రత్యేక ఆభరణాలను ఆమెను మహారాణిలా తీర్చిదిద్దాయి. దక్షిణాది సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని శ్రీ జ్యూవెలర్స్ సంస్థ రష్మిక మందన్న కోసం ఈ నగలను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అంతేకాదు దేవరకొండ కుటుంబ ఆనవాయితీగా వస్తున్న బంగారు గాజులను విజయ దేవరకొండ తల్లి మాధవి తన కోడలికి బహుమానంగా అందించినట్లు సమాచారం.
also read:Vijay -Rashmika: వివాహం అనంతరం రాజకీయ ప్రముఖులను కలుస్తున్న విరోష్ జంట.. ఉదయం అమిత్.. ఇప్పుడు మోదీ..
ఇకపోతే ఈ పెళ్లి వేడుకల్లో విజయ్ దేవరకొండ నక్షి ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇలా మొత్తానికైతే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సాంప్రదాయ దుస్తుల్లో మెరవడమే కాకుండా దక్షిణాది సంప్రదాయాల మేలవింపులో డిజైన్ చేసిన జ్యూవెలరీని ధరించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇకపోతే శ్రీ జ్యూవెలరీ సంస్థకు ఇంత అద్భుతమైన బంగారు ఆభరణాలను తయారు చేయడానికి సుమారుగా 10 నెలల సమయం పట్టినట్లు సమాచారం.