E-Paper
Advertisement

Protein Rich Foods: రోజంతా అలసటగా ఉంటుందా? ఈ ప్రొటీన్ ఫుడ్స్‌తో సూపర్ యాక్టివ్‌గా మారిపోండి!

Protein Rich Foods: రోజంతా అలసటగా ఉంటుందా? ఈ ప్రొటీన్ ఫుడ్స్‌తో సూపర్ యాక్టివ్‌గా మారిపోండి!
Advertisement

Protein Rich Foods: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా పరిగెడుతుంటాం. ఇంటి పనులు, ఆఫీసు టెన్షన్లు వెరసి మనల్ని నిస్సత్తువలోకి నెట్టేస్తుంటాయి. అయితే, ఈ అలసటను పారద్రోలి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు తప్పనిసరి. ముఖ్యంగా శరీరానికి శక్తినిచ్చే ప్రొటీన్ మన డైట్‌లో ఉంటే.. అలసట అనేదే దరిచేరదు.

గింజలతో ఆరోగ్యం:

ఆఫీసులో గానీ లేదా ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో చిరుతిండి తినాలనుకుంటే.. బాదం, పిస్తా, అక్రోట్ వంటి నట్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి కేవలం ఆకలిని తీర్చడమే కాదు, గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. అయితే, వీటిలో క్యాలరీలు కాస్త ఎక్కువ కాబట్టి.. వీటిని మితంగా తీసుకోవాలి. అలాగే సలాడ్లు లేదా కూరల్లో వీటిని కలిపి తీసుకుంటే రుచితో పాటు శక్తి కూడా అందుతుంది.

Advertisement

Also Read: బిగినర్స్ కోసం బెస్ట్ టిప్స్.. మీ జిమ్ బ్యాగులో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి!

పాలలోని శక్తి:

కండరాల పుష్టికి పాలు, పాల పదార్థాలు మేటి అని చెప్పొచ్చు. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికీ సహాయపడతాయి. అయితే అధిక బరువు పెరగకుండా ఉండాలంటే ఫ్యాట్ తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. లేదంటే.. ప్రొటీన్లతో పాటు కొవ్వు పదార్థాలు కూడా శరీరంలో నిల్వ ఉండే ఆస్కారం ఉంటుంది.

శాకాహార ప్రొటీన్లు:

Advertisement

శాకాహారులు సోయాబీన్స్ , సోయా పాలు లేదా టోఫూ తీసుకుంటే శరీరానికి మంచి ప్రొటీన్ అందుతుంది. వీటితో పాటు బఠాణీలు, బీన్స్, రాజ్మా వంటి చిక్కుడు జాతి గింజలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. కూరగాయల ద్వారా అందే సహజమైన ప్రొటీన్ మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.

మాంసాహారం, గుడ్లు:

చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇక చికెన్, మటన్ వంటి మాంసాహారం ప్రొటీన్లకు కేరాఫ్ అడ్రస్ అయినప్పటికీ, వాటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. తక్కువగా తీసుకోవాలి. గుడ్లు కూడా మంచి ఆహారమే, కానీ గుండె జబ్బులు లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.

Also Read: డల్ స్కిన్‌తో విసిగిపోయారా? పెరుగులో వీటిని కలిపి వాడితే చర్మం నిగారిస్తుంది!

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×