E-Paper
Advertisement

‘ఇరుముడి’ సక్సెస్… తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మణెమ్మ..

‘ఇరుముడి’ సక్సెస్… తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మణెమ్మ..
Advertisement

Irumudi Nakshatra: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రవితేజ(Raviteja) హీరోగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఇరుముడి (Irumudi). ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివ నిర్వాణ (Siva Nirvana) దర్శకత్వంలో రవితేజ నటించిన ఇరుముడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 250 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకొని సంచలనాలను సృష్టించింది. ఇలా ఈ సినిమా ద్వారా రవితేజకు చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ వచ్చింది. ఇక ఈ సినిమాలో మణెమ్మ పాత్ర(Manemma)లో నటించిన బేబీ నక్షత్ర(Baby Nakshatra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇరుముడితో మణెమ్మగా గుర్తింపు..

రవితేజ కూతురిగా మణెమ్మ పాత్రలో బేబీ నక్షత్ర నటించారు అనడం కంటే కూడా జీవించారు అని చెప్పాలి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయినా నక్షత్ర ప్రస్తుతం తదుపరి సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇదివరకు పలు మలయాళ సినిమాలలో నటించిన నక్షత్ర తెలుగులో మొదటిసారి ఇరుముడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం తెలుగులో ఈ చిన్నారికి వరుస అవకాశాలు వస్తున్నాయి.

తల్లికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన నక్షత్ర..

Advertisement

ఈ విధంగా ఇరుముడి సినిమా మంచి సక్సెస్ కావడంతో నక్షత్రం తన తల్లికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈమె తన అమ్మకోసం సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసిన కారును(Car) కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నక్షత్ర తన తల్లికి కారును కొనివ్వడంతో చిన్నారిపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. బేబీ నక్షత్రం ఇంత చిన్న వయసులోనే తన తల్లికి ఖరీదైన కారును కొనివ్వడం పట్ల అభిమానులు, నెటిజన్స్ చిన్నారి నక్షత్ర పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సింగిల్ పేరెంట్ గా బాధ్యతలు..

బేబీ నక్షత్రకు తండ్రి లేరని విషయం అందరికీ తెలిసిందే. ఇలా సింగిల్ పేరెంట్ గా నక్షత్ర బాధ్యతలను తీసుకొని తన తల్లి ఆమెను చక్కగా పెంచుతూ తనకి ఇష్టమైన సినీ రంగంలో ప్రోత్సహిస్తూనే మరో వ్యక్తి తన చదువు బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇలా తల్లి తండ్రి తానై నక్షత్ర బాధ్యతలను చూసుకుంటున్న తన తల్లికి నక్షత్ర అదిరిపోయే కానుక ఇచ్చారని చెప్పాలి. ఇక ఇరుముడి సినిమా తర్వాత నక్షత్రకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇలా ఇరుముడితో కెరియర్ పరంగా కూడా నక్షత్ర మంచి సక్సెస్ అందుకున్నారు అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈమె మణెమ్మగా గుర్తుండి పోయిందని చెప్పాలి.

Advertisement

Also Read: ఇడుపు కాయితం పాట పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

Related News

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!

త్రిష రోడ్ షో చూస్తే మైండ్ బ్లాక్.. పొలిటికల్ ఎంట్రీకి ఇదే సిగ్నలా?

ఇడుపు కాయితం పాట పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

అన్ స్టాపబుల్ సీజన్ 5 ప్రారంభం.. పస్ట్ గెస్ట్ గా మెగాస్టార్?

ఘనంగా అర్జున్ చిన్న కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్!

కృష్ణ మరణం మహేష్, నరేష్ మధ్య విభేదాలు.. నటుడు క్లారిటీ!

రాజమౌళి నుంచి త్రివిక్రమ్ వరకు.. తనికెళ్ల భరణి చెప్పిన ఆసక్తికర విషయాలు!

Big Stories

Advertisement
×