E-Paper
Advertisement

Irumudi: ‘ఇరుముడి’ నుంచి శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్.. షూటింగ్ అప్డేట్ ఇదే!

Irumudi: ‘ఇరుముడి’ నుంచి శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్.. షూటింగ్ అప్డేట్ ఇదే!
Advertisement

Irumudi: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi Movie). ప్రస్తుతం రవితేజ వరుస ఫ్లాప్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాడని, ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కారణం ఈ సినిమా దర్శకుడే. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మంచి చిత్రాలుగా గుర్తింపు పొందాయి. అందుకే ఈ సినిమాపై అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. పాన్-ఇండియన్ పవర్‌హౌస్ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ల ఫస్ట్ లుక్‌ పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్‌తో పాటు, శ్రీరామనవమి (Sri Rama Navami) శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ వదిలారు.

Also Read- Big TV Kissik Talks: నా భర్త ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు.. రొమాంటిక్ కూడా- మాధురి

షూటింగ్‌పై తాజా అప్డేట్

Advertisement

షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుందని తెలుపుతూ.. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోందని.. అనల్ అరసు, రియల్ సతీష్ స్టంట్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అత్యంత అద్భుతమైన ఫైట్‌లను ప్రేక్షకులు ఈ సినిమాలో చూడబోతున్నారని టీం చెబుతోంది. యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటుందని.. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని మేకర్స్ వదిలిన పోస్టర్స్ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చాయి.

Also Read- Nandamuri Balakrishna: అసెంబ్లీకి తాగి వస్తాడంటూ బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు

తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్ తెలిపేలా..

Advertisement

శ్రీరామనవమి స్పెషల్‌గా వదిలిన పోస్టర్‌ను గమనిస్తే.. రవితేజ ఇంతకు ముందు పోషించిన పాత్రల్లన్నింటిలోకి విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ తెలియజేసింది. ఈ చిత్రంలో తన కుమార్తెగా నటించిన బేబీ నక్షత్రతో రవితేజకు ఉన్న బంధాన్ని తెలియజేస్తూ, చిత్ర బృందం ఒక అందమైన, ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ వింటేజ్, విలేజ్, మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. సాధారణ చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి తన కుమార్తెతో కలిసి నడుస్తూ ఉన్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే తండ్రీకూతుళ్లు మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. తప్పకుండా ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Also Read- Duvvada Madhuri: బట్టలిప్పుకుని తిరిగితే స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు.. అనసూయకు భారీ పంచ్

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×