Romantic Comedy OTT: లైఫ్ లో చాలా మంది నిలకడ లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి గందరగోళ నిర్ణయాలవల్ల, వాళ్ళకు ఏమో గాని, పక్క న ఉన్న వాళ్ళు ఎక్కువగా బాధపడాల్సి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ సినిమా అందరి మనసును దోచింది. జూలీ అనే ఒక యువతి ప్రేమ, కెరీర్ విషయంలో తీసుకునే నిర్ణయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సినిమా చూస్తే చాలా విషయాలలో మనల్ని చూసుకున్నట్టు ఉంటుంది. నిజానికి జూలీ పాత్రలో నటించిన హీరోయిన్ రెనే రియిన్సే ఈ సినిమా కంటే ముందు యాక్టింగ్ మానేద్దాం అనుకుంది. కానీ ఈ సినిమాతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా, కేన్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా రావడం విశేషం.
ఈ నార్వేజియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘ది వర్స్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్’ (The Worst Person in the World). దీనికి జోచిమ్ ట్రియర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. ఇందులో కథానాయిక రెనే రియిన్సే నటనకు గాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఉత్తమ నటి’ అవార్డు కూడా లభించింది. అంతేకాకుండా 94వ ఆస్కార్ అవార్డుల్లో ఈ చిత్రం ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’, ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’ విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఈ సినిమాని మొత్తం 12 చాప్టర్లు, ఒక పరిచయం, ఒక ముగింపు లాగా విభజించి తీశారు. సినిమా చూస్తున్నంత సేపు ఒక నవల చదువుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనిని ముబి, ప్రైమ్ వీడియోలో ఎంచక్కా చూసేయచ్చు.
ఈ కథ అంతా జూలీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈమెకి అసలు లైఫ్‌లో ఏం కావాలో తనకే క్లారిటీ ఉండదు. ముందు డాక్టర్ అవుదామనుకుంటుంది, ఆ తర్వాత సైకాలజీ అంటుంది, చివరికి ఫోటోగ్రఫీ అని సెటిల్ అవుతుంది. రిలేషన్ షిప్స్ విషయంలో కూడా అంతే. తనకంటే వయసులో పెద్దవాడైన అక్సెల్ అనే కార్టూనిస్ట్‌తో ప్రేమలో పడుతుంది. అతను సెటిల్ అయిపోయి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కందాం అంటాడు. కానీ జూలీకి మాత్రం ఇంకా ఏదో వెతుకులాట, లైఫ్ ఇలాగే అయిపోతుందా అన్న భయం పట్టుకుంటుంది.
అలాంటి టైమ్‌లో ఒక రాత్రి జూలీకి, ఒక పెళ్లి రిసెప్షన్‌లో ఐవింద్ అనే కుర్రాడు పరిచయం అవుతాడు. వాళ్లిద్దరూ ఆ రాత్రంతా పిచ్చి పిచ్చిగా ప్రేమించేసుకుంటారు. ఆ తర్వాత అక్సెల్‌తో బోర్ కొట్టిన జూలీ, అతన్ని వదిలేసి ఐవింద్‌తో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది. ఈ గ్యాప్‌లో వచ్చే సీన్లు చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. చివరికి ఏం జరిగిందంటే, లైఫ్ ఎవరి కోసం ఆగదు కదా. జూలీ మళ్ళీ తన పాత ప్రేమికుడు అక్సెల్ చావుకు దగ్గరగా ఉన్నాడని తెలుసుకుంటుంది. ఆ టైమ్‌లో వాళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. చివర్లో జూలీ ఎవరితోనూ ఉండకుండా, ఒంటరిగానే తనకి నచ్చిన ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో పని చేస్తూ కనిపిస్తుంది. అంటే జీవితంలో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలే మనల్ని మనం తెలుసుకునేలా చేస్తాయని ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.
Read Also : సినిమా కష్టాలతో సినిమా తీయాలనుకునే తింగరి బ్యాచ్… అన్ లిమిటెడ్ కామెడీతో అదరగొడుతున్న సిరీస్