E-Paper
Advertisement

Duvvada Madhuri: బట్టలిప్పుకుని తిరిగితే స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు.. అనసూయకు భారీ పంచ్

Duvvada Madhuri: బట్టలిప్పుకుని తిరిగితే స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు.. అనసూయకు భారీ పంచ్
Advertisement

Duvvada Madhuri: ఈ మధ్య నటుడు శివాజీ ఓ మూవీ వేడుకలో డ్రస్సు గురించి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారాన్ని రేపాయో తెలియంది కాదు. ఆ వ్యాఖ్యలకు శివాజీ సారీ చెప్పడమే కాకుండా, వుమెన్ కమిషన్ ముందు కూడా హాజరు కావాల్సి వచ్చింది. ఇక శివాజీ మాటలపై సోషల్ మీడియాలో అనసూయ, చిన్మయి వంటి వారు దాదాపు తిరుగుబాటునే ప్రకటించారు. చాలా రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ అంశంపై తాజాగా దువ్వాడ మాధురి (Duvvada Madhuri) షాకింగ్ కామెంట్స్ చేశారు. బట్టలిప్పుకుని తిరగడం స్వాతంత్ర్యం కాదని ఆమె హితవు పలికారు. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో డ్రస్సింగ్ గురించే కాకుండా, పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనే దానిపై కూడా ఆమె ఓ వివరణ ఇచ్చారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..

Also Read- Nikhil Siddhartha: మార్కాపురం బస్ యాక్సిడెంట్‌పై నిఖిల్ ఆవేదన.. ప్రధానికి రిక్వెస్ట్!

బట్టలిప్పుకుని తిరగడమే స్వాతంత్య్రం కాదు..

Advertisement

వాస్తవానికి శివాజీ కాంట్రవర్సీ (Sivaji Controversy) పై దువ్వాడ జంట ఎప్పుడో స్పందించారు. శివాజీ చెప్పిన విధానం కరెక్ట్‌గా లేదు కానీ, ఆయన చెబుతుంది మాత్రం మంచి విషయమే అని ఈ జంట ఓ ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు దువ్వాడ మాధురి మాట్లాడుతూ.. ‘‘డ్రస్సింగ్ విషయంలో అమ్మాయిలకు 100 శాతం లిమిట్స్ ఉండాలి. బట్టలిప్పుకుని తిరిగితే.. అదే స్వాతంత్య్రం అనుకోవడం చాలా తప్పు. ఎవరైనా ఇండిపెండెంట్‌గా ఎదిగితేనే స్వాతంత్య్రం వచ్చినట్లు తప్పితే, బట్టలిప్పుకుని తిరిగితే మీకు స్వాతంత్య్రం వచ్చినట్టు కాదు’’ అని మాధురి ఈ విషయంపై కుండబద్దలయ్యేలా ఆన్సర్ ఇచ్చారు. ఈ విషయం ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరేమో.. ‘మా ఇష్టాన్ని కాదని అనడానికి మీరెవరు?’ అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొందరు.. ‘శివాజీ చెబుతుంది అక్షర సత్యం’ అంటూ ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు.

Also Read- Duvvada Madhuri: వాళ్లంతా జెండా కూలీలే.. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే?

సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకోండి

Advertisement

దువ్వాడ మాధురిలా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, యంగ్ ఏజ్‌లో పెళ్లి చేసుకోకూడదని అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని మాధురిని అడిగితే.. ‘‘ఎప్పుడు ఏం జరగాలో అది జరిగితే బాగుంటుంది. కానీ, సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా జీవించగలరు. నేను ముందు నుంచి ఫైనాన్సియల్‌గా ఇండిపెండెంట్‌గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశా, రియల్ ఎస్టేట్ చేశా.. ఇవన్నీ అయిన తర్వాతే పాలిటిక్స్‌లోకి వచ్చాను..’’ అని మాధురి చెప్పుకొచ్చారు. నిజమే, ఈ రోజుల్లో సెటిల్ అవకుండా పెళ్లి చేసుకుంటే, చాలా తొందరగా వారి లైఫ్ విడాకుల బాట పడుతుంది. కాబట్టి, ఈ విషయంలో దువ్వాడ అభిప్రాయాన్ని ఏకీభవించవచ్చు.

Also Read- Kissik Talks: ఎంతమంది చేసుకోలేదు.. నేనొక్కదాన్నే రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నానా? – దువ్వాడ మాధురి

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×