E-Paper
Advertisement

Cm Revanth: తిన్నది అంతా కక్కిస్తా!

Cm Revanth: తిన్నది అంతా కక్కిస్తా!
Advertisement

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌‌గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రోజుకో కొత్త టాపిక్ తెరమీదకు వస్తున్నది. మొన్నటివరకు ఆరు గ్యారంటీలు, మూసీ పునరుజ్జీవం, ఆ తర్వాత ఉద్యోగుల బెనిఫిట్స్, బకాయిల విడుదల, రైతు భరోసా, బోనన్ గురించి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. తాజాగా వైద్యారోగ్య శాఖలో బకాయిల గురించి సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వలన చాలా వరకు హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ కింద సేవలు అందించడం లేదని ఆరోపించింది. వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

సగం సగం నిధులు..

కార్పొరేట్, ప్రభుత్వ లిస్టింగ్ హాస్పిటల్స్ మరోసారి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసేందుకు సిద్ధమయ్యాయి. దీనికి బకాయిలు విడుదల కాకపోవడమే కారణంగా తెలుస్తున్నది. ఎందుకంటే రూ. వందల కోట్ల మేర ఆరోగ్య శ్రీ బకాయిలు నిలిచిపోయాయి. సర్కారు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఖజానా ఖాళీగా దర్శనమిస్తున్నట్టు సమాచారం.దీంతో ఆస్పత్రులు ఎప్పుడు బకాయిల గురించి మాట్లాడినా సర్కారు వీలైనంతలో వారికి సర్దుబాటు చేస్తూ సమయం కోరుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆరోగ్య శ్రీ బకాయిల కోసం రాష్ట్రంలోని హాస్పిటల్స్ సేవలు నిలిపివేసేందుకు సిద్దమయ్యాయి.దీంతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. హాస్పిటల్స్ మేనెజ్మెంట్స్‌తో చర్చలు జరిపి మరల ఆరోగ్య శ్రీ సేవలను పునరుద్ధరింపచేశారు.

సీఎం రేవంత్ నజర్..

Advertisement

ఇదిలాఉండగా, ఫస్ట్ టైం జరిపిన చర్చల ప్రకారం తొలివిడతలో కొంత క్లియర్ చేయగా.. రెండో విడత కూడా విడుదల చేయాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి.లేదంటే ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించాయి.దీంతో మరోసారి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతాయా? అంటూ సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ ఆలస్యం చేయకుండా బకాయిలు చెల్లించాలని, లేదంటే సామాన్యులు ఇబ్బందులు పడతారని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ బకాయిలు అలా పేరుకుపోవడానికి గల కారణాలు, సీఎంఆర్ఎఫ్‌లో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. గత పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ హయాంలో పెద్దఎత్తున ఆస్పత్రులకు బిల్లులు చెల్లంచలేదని గుర్తుచేశారు.

Big TV Kissik Talks: నా భర్త ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు.. రొమాంటిక్ కూడా- మాధురి

Advertisement

తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో రూ. వేల కోట్లల్లో పేరుకుపోయిన ఆరోగ్య శ్రీ బకాయిలను రూ. వందల కోట్లకు తగ్గించామని పేర్కొన్నారు. త్వరలోనే మిలిగిన బకాయిలను క్లియర్ చేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, గతంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పెద్దఎత్తున పక్కదారి పట్టాయని సీఎం రేవంత్ ముందు నుంచి ఆరోపిస్తూ వచ్చారు. లేని బిల్లులు క్రియేట్ చేసి కొందరు గులాబీ నేతలు ఆస్పత్రులతో కుమ్మక్కై నిధులు పక్కదారి పట్టించినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులకు సీఎంఆర్ఎఫ్ రాకుండా అనర్హులకు కేటాయించి వారి నుంచిపెద్దఎత్తున కమీషన్లు పొందారని సీఎం రేవంత్ ఇప్పటికే గుర్తించారు. వారి లెక్కలు తీయాలని సంబంధిత అధికారులను సైతం ఆదేశించారు. ప్రస్తుతం సీఎం ఆర్ఎఫ్ నిధులు మాయం చేసిన విషయంలో విచారణ జరుగుతోందని, నిందితులను త్వరలోనే గుర్తించి వారు తిన్నతి అంతా కక్కిస్తానని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఇలా చేయడం వలన సర్కారు ఖజానాపై భారం తగ్గుతుందని నిపుణులు అంచనా వేసినట్టు తెలుస్తోంది.

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×