Irumudi vs Toxic:ఇరుముడి ..టాక్సిక్ ..ఈ రెండు సినిమాల ఫలితాలు సినిమా ఇండస్ట్రీకి పెద్ద గుణపాఠాలనే నేర్పిస్తున్నాయి.అవును.దాదాపు నలబై కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమా ఇరుముడి ఒకవైపు అయితే, ఆరొందల( సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు మరి)బడ్జెట్ తో వచ్చిన టాక్సిక్ మరోవైపు.రెండూ వారం గ్యాప్ లో వచ్చిన సినిమాలు.వీటిలో ఇరుముడి సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ ఇరగదీస్తుండగా , టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుని థియేటర్లకి బాయ్ బాయ్ చెప్పే పనిలో ఉంది.
నిజానికి టాక్సిక్ సినిమా వస్తుందనగానే ఇక ఇరుముడి సినిమా పక్కకి తప్పుకోవాల్సిందే అన్న మాటలు బలంగా వినిపించాయి.సినిమాపై పెరిగిపోయిన అంచనాలు చూస్తే అది నిజమే అవుతుందని అనుకున్నారంతా.కానీ సీన్ రివర్స్ అయింది.మొదటి రోజే డివైడ్ టాక్ మూట గట్టుకున్న టాక్సిక్ సినిమా మూడో రోజుకల్లా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది,అదే సమయంలో అసలు థియేటర్ లలో సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాల మధ్య ఊగిసలాడిన ఇరుముడి సినిమా ఇపుడు రెండొందల కోట్లని దాటి పరుగులు తీయడం గమనార్హం.
వాస్తవానికి ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే నాలుగు పాటలు, ఐదు ఫైట్లు , అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ అన్నట్టుగా ఉండేది. ఇక ట్రెండ్ మారి సినిమా కాస్తా ప్యాన్ ఇండియా ట్యాగ్ వేసుకోవడంతో బడ్జెట్లు పెరిగిపోయాయి,దాంతో ఆటోమేటిక్ గా స్టార్ పవర్ , గ్రాండియర్ సెట్స్ ,వావ్ అనిపించే వియఫ్ఎక్స్ ..ఇలా ప్రతీ క్రాఫ్ట్ పరిమితులు దాటేసింది.కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అన్నిమార్చేసిన మేకర్స్ కథని మాత్రం ఇంకా అక్కడే వదిలేయడమే.అన్నీ అధ్బుతంగా అందిస్తున్నాం..అలాంటింది ఆ ఒక్కటీ ఎందుకు అన్నట్టు ఆయువు పట్టైన కథని పట్టించుకోకుండా పోవడమే ఇపుడు సినిమాల కొంప ముంచుతుంది.
ఇరుముడి ..టాక్సిక్ ల సినిమాల విషయానికే వస్తే ..రూరల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో ఒక తండ్రి కూతురు ఎమోషన్ తో డివైన్ టచ్ ఇస్తూ అధ్బుతంగా సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ శివ నిర్వాణ.ఇలాంటి సినిమాలు రాలేవా అంటే టాలీవుడ్ లో కోకొల్లలు.కానీ కథ చెప్పే దర్శకుడి నిజాయితీ ఆడియన్స్ కి పిచ్చగా ఎక్కేసింది.ఎన్ని వచ్చినా ఇదేదో ఉందే అనేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు శివ నిర్వాణ.ఈ ఎమోషన్ ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అవ్వడంతోనే ఇపుడు కోట్లు ఇరుముడికి కోట్లు ముట్టజెబుతున్నారు.
కాని టాక్సిక్ సినిమా …ఇందులో అన్నీ ఉన్నాయి.మిరుమిట్లు గొలిపే సెట్లు,కళ్ళు చెదిరే యాక్షన్స్ సీక్వెన్స్, గ్లామర్ ఒలికించే అందాల భామలు,మెస్మరైజ్ చేసే విజువల్స్.ఇలా అన్నీ ఉన్నాయి.కానీ లేనిదల్లా కథ ఒక్కటే.ఏ మూలనో ఎదో ఉందనిపించినా ఆడియన్స్ కి కనెక్ట్ కానిదే.రాయ ప్రపంచానికి ఎక్కడా,తమ ప్రపంచానికి అసలు సంబంధం లేదే అంటూ సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్ళంతా డీలా పడిపోయిన పరిస్థితి.
also read :సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?
ఇక కలెక్షన్స్ చూస్తే 600కోట్ల బడ్జెట్ తో వచ్చిన టాక్సిక్ మూడొందల కోట్లని వెనకేస్తే కేవలం 40 కోట్లతో వచ్చిన ఇరుముడి రెండొందల కోట్లని దాటేసింది.మరి పెట్టుబడికి, రాబడికి మధ్య తేడా చూస్తే తెలిసిపోతుంది ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇరగదీస్తుందో.
చూడాలి మరి ముందు ముందు అయినా కథా కాకరకాయా అంటూ తీసి అవతల పడేయకుండా ముందు ఈ కథ ఆడియన్స్ అసలెందుకు చూడాలి అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే ఇలా టాక్సిక్ సినిమాలు రిపీట్ కావేమో కాబోలు.