E-Paper
Advertisement

ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త రూల్స్.. కేంద్రం కొత్త పోర్టల్.. ఇలా అప్లై చేయండి?

ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త రూల్స్.. కేంద్రం కొత్త పోర్టల్.. ఇలా అప్లై చేయండి?
Advertisement

CRS Portal: కోర్ అర్బన్ రీజియన్ ప్రజలకు పౌర సేవలతో పాటు అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ప్రస్తుతమున్న పాత విధానానికి అధికారులు స్వస్తి పలికారు. ఇతర రాష్ట్రాల మాధిరిగానే కేంద్ర ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారానే ఇకపై కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు సీఆర్ఎస్ పోర్టల్ లోనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవల్సిందే. పెరిగిన జీహెచ్ఎంసీ పరిధి మూడు ముక్కలుగా విభజన కాకముందు గత ఫిబ్రవరి 11వ తేదీకి ముందు జీహెచ్ఎంసీలోని పలు సర్కిళ్లలో బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ చేసిన వ్యవహారం వెలుగులోకి రావటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్..

ముఖ్యంగా ప్రస్తుతం ఈ సేవా, మీ సేవా కేంద్రాలతో పాటు జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లో అందుబాటులో ఉన్న సిటిజన్ సర్వీసు సెంటర్లలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే, సంబంధిత సిబ్బంది పంఛనామా నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసే వారు. కానీ ఇకపై ఈ విధానం అందుబాటులో ఉండదు. కేంద్ర ప్రభుత్వ రంగ పోర్టల్ అయిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) లోనే ఆన్ లైన్ దరఖాస్తు చేసుకుంటేనే సర్టిఫికెట్లు జారీ కానున్నాయి. ఈ విధానాన్ని గత నెల పంద్రాగస్టు రోజు నుంచే అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ, జీహెచ్ఎంసీ అధికారులు యోచించినా, సాంకేతిక లోపాలు, సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులకు శిక్షణ వంటి కారణాలతో మంగళవారం నుంచి మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అమల్లోకి తీసుకువచ్చారు. ట్రయల్ రన్ గా జీహెచ్ఎంసీలోని అంబర్ పేట సర్కిల్ లో మంగళవారం ఈ కొత్త విధానంతో ఓ బర్త్, మరో డెత్ సర్టిఫికెట్ ను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

16 అంకెల యూనిక్ నెంబర్‌లో సర్టిఫికెట్ జారీ..

Advertisement

సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్ ) పోర్టల్ ద్వారా దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా జారీ చేస్తున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ కు ఆధార్ కార్డు నెంబర్ తరహాలో 16 అంకెల యూనిక్ నెంబర్, ప్రత్యేక క్యూర్ ఆర్ కోడ్ ను కేటాయించనున్నారు. ఈ విధానాన్ని గత సంవత్సరం అక్టోబర్ మాసం నుంచే అమల్లోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించినప్పటికీ, జీహెచ్ఎంసీ పరిధిలోకి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలు కూడా ఉండటంతో కోర్ సిటీలో బర్త్, డెత్ రిజిస్ట్రేషన్ల పవర్ మెడికల్ ఆఫీసర్లకు ఉండగా, రంగారెడ్డి, సంగారెడ్డి జల్లాల్లో బర్త్, డెత్ ల రిజిస్ట్రేషన్ అధికారాలు కలెక్టర్లకు ఉండటంతో సీఆర్ఎస్ అమలు కాస్త కష్టతరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సీఎస్ఆర్ నమూనాను జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లకు రీ మ్యాపింగ్ చేసేందుకు సమయం పట్టడంతో సీఎస్ఆర్ అమలుకు కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు అధికారులు సర్టిఫికెట్ల జారీని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావటంతో సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టినట్టయింది.

Also read: నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

బోగస్ సర్టిఫికెట్ల జారీ, అవినీతికి చెక్..

Advertisement

జీహెచ్ఎంసీలో ప్రస్తుతం అమలవుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విధానాన్ని కొందరు జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లు దుర్వినియోగం చేస్తూ బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఉదాంతాలు బయట పడ్డాయి. వేల రూపాయల లంచాలు తీసుకుని గతంలో ఖైరతాబాద్ మెడికల్ ఆఫీసర్ బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన విషయం బయట పడి, సదరు అధికారులు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత టౌలీ చౌకీలోని మరో హాస్పిటల్ 2024లో లంచాలు తీసుకుని బోగస్ బర్త్, డెత్ సర్టిఫికేట్లు జారీ చేసిన వ్యవహారం కూడా బయట పడటంతో అప్పట్లో ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణ జరిపించి, అందుకు బాధ్యులైన హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారు. ఈ రకంగా అనేక అక్రమాలకు పాల్పడేందుకు ఆస్కారమున్న ఈ పాత విధానానికి అధికారులు స్వస్థ పలికి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) ను అందుబాటులోకి తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ లో గడిచిన దశాబ్దాల కాలంగా జారీ చేసిన దాదాపు లక్షల్లో నున్న బర్త్, డెత్ సర్టిఫికెట్లను ప్రస్తుతం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) పోర్టల్ లోకి అప్ లోడ్ కూడా చేస్తునారు. ఒక వైపు షేరింగ్ ప్రక్రియ కొనసాగస్తునే దరఖాస్తుదారులకు పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

మొత్తం 87 లక్షల 28 వేల 510 సర్టిఫికెట్లు..

మూడు కార్పొరేషన్లలో గత నెల మొదటి వారం వరకు 87,28,510 బర్త్ సర్టిఫికెట్లు నమోదుకాగా, వీటిలో 15,14,615 సర్టిఫికెట్ల వివరాలను కేంద్ర పోర్టల్‌ సీఆర్ఎస్ తో అనుసంధానం చేసినట్లు తెలిసింది. అలాగే 16,26,428 డెత్ సర్టిఫికెట్లు నమోదుకాగా, వాటిలో 5,96,223 సర్టిఫికెట్ల డేటాను సెంట్రల్ పోర్టల్ కు షేర్ చేశారు. సీఆర్‌ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్ పొందినవారు రెండు సార్లు మాత్రమే సవరణలు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం అమలుపై కేంద్ర ప్రభుత్వ అధికారులు మూడు కార్పొరేషన్లలోని 60 సర్కిళ్ల అధికారులతో ఇప్పటికే పలు సార్లు సమావేశం నిర్వహించి శిక్షణ కూడా ఇచ్చారు. మూడు కార్పొరేషన్ల పరిధలోని 60 సర్కిళ్ల మెడికల్ ఆపీసర్లకు యూజర్ ఐడీలు కూడా జారీ చేశారు.

Also read: 5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

నెలరోజుల్లో దరఖాస్తు చేసుకుటేనే ఉచితం..

జనన, మరణాల నమోదు విషయంలో అవి జరిగిన రోజు నుంచి 30 రోజుల లోపు ఆన్ లైన్ లో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నమోదు పూర్తిగా ఉచితంగా ఉంంటుందని అధికారులు తెలిపారు. అదే ఒక సంవత్సరం లోపు ఆలస్యమైతే సంబంధిత జిల్లా రిజిస్ట్రార్ అనుమతితో జరిమానా చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్య ఆలస్యమైతే జిల్లా కలెక్టర్ అనుమతితో పాటు లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండు సంవత్సరాలకు మించి ఆలస్యమైతే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల ఆధారంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు పొందేలా నిబంధనలను సిద్దం చేశారు. సీఆర్‌ఎస్ అమలుతో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని మూడు కార్పొరేషన్ల అధికారులు భావిస్తున్నారు.

జిల్లాల వారీగా సర్టిఫికెట్ల రిజిస్ట్రార్లు..

క్యూర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లా వరకు అయితే రిజిస్ర్టార్ గా జీహెచ్ఎంసీ కమిషనర్ కొనసాగనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 25 సర్కిల్స్ తో పాటు కంటోన్మెంట్ కూడా ఉంది. మిగతా మూడు జిల్లాలకు ఆయా జిల్లాల డీఎం అండ్ హెచ్ఓలు రిజిస్ర్టార్లుగా, మేడ్చల్–మల్కాజ్ గిరి జిల్లాలో 20 సర్కిల్స్ ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 13 సర్కిళ్లు, సంగారెడ్డి జిల్లాలో 2 సర్కిళ్లున్నాయి.

Also read: పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

Tags

Related News

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

జీహెచ్‌ఎంసీలో డబుల్ బిల్లుల భారీ కుంభకోణం.. రూ. 70 కోట్ల నిధులు దారిమళ్లింపు!

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఏఐసీసీ సంచలన నిర్ణయం!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

Big Stories

Advertisement
×