Tamil OTT Releases: ఒకప్పుడు కొత్త సినిమా చూడాలంటే థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వల్ల ఇంట్లోనే కూర్చుని వివిధ భాషల సినిమాలను చూసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా తమిళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంది. కథలో కొత్తదనం, ఎమోషన్స్, యాక్షన్, రా అండ్ రియలిస్టిక్ మేకింగ్ వంటి అంశాల కోసం తమిళ చిత్రాలను ఫాలో అయ్యే తెలుగు వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి సమయంలో నెట్‌ఫ్లిక్స్ కొన్ని మోస్ట్ అవైటింగ్ తమిళ సినిమాల లైనప్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా 19 మూవీస్ ఈ లిస్ట్ లో ఉండడం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ‘డొరోథీ’ (Dorothy). ఇది ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యం, ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి వచ్చే మార్పులు, సమాజంలోని పాత ఆలోచనలను ప్రశ్నించే అంశాలతో రూపొందింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. దీంతో తమిళ సినిమాల కోసం వెతికే తెలుగు ఆడియన్స్ కూడా ఈ టైటిల్‌ను తమ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.
ఆ తరువాత లిస్ట్ లో ‘బత్తా’ (Baththa), ‘సిగ్మా’ (Sigma), ‘హైకూ’ (Haiku), ‘సీన్’ (Scene), ‘ఓం’ (OM), ‘ఇరండు వానం’ (Irandu Vaanam), ‘మిస్టర్ భారత్’ (Mr Bhaarath), ‘బ్రో క్లబ్’ (Bro Club), ‘బెంజ్’ (Benz) వంటి కొత్త సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ‘రాజన్ వగైరా’ (Rajan Vagaiyara), ‘నింజా’ (Ninja), ‘సూపర్‌హీరో’ (SuperHero), ‘దయంగరం’ (Dayangaram), ‘మార్షల్’ (Marshal), ‘ఆర్డినరీ మ్యాన్’ (OrdinaryMan) వంటి అప్ కమింగ్ మూవీస్ పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉండడం విశేషం.
ఇక D56, AGS29, JohnDoe వంటి మోస్ట్ అవైటింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. అయితే ఈ సినిమాలలో చాలా వరకు ఇంకా థియేటర్లలోకి రాలేదని చెప్పాలి. కాబట్టి లిస్ట్ లో ఉన్న సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నెట్ ఫ్లిక్స్ నుంచి రిలీజ్ డేట్లకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే గానీ ఈ సస్పెన్స్ ను తెరపడదు.
ఈ 19 టైటిల్స్‌లో ఏది ముందుగా రిలీజ్ అవుతుంది ? ఏ సినిమాకు స్టార్ హీరోలు పని చేస్తున్నారు ? ఏవి తెలుగు డబ్బింగ్ లోనూ వచ్చే అవకాశం ఉంది ? వంటి వివరాలు అధికారికంగా ప్రకటించినప్పుడు మరింత స్పష్టత వస్తుంది. తమిళ సినిమాలపై ఆసక్తి ఉన్నవారు నెట్‌ఫ్లిక్స్ పై ఓ కన్నేసి ఉంచాలి, అంతేకాదు ఈ దిగ్గజ ఓటీటీ కొత్త అప్‌డేట్స్ ను ఎప్పటకప్పుడు ఫాలో అయితే లిస్ట్ లో ఉన్న సినిమాలను మిస్ కాకుండా చూడవచ్చు. ప్రస్తుతం ఇందులో నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘డోరోతీ’ని చూసి ఎంజాయ్ చేయండి.
Read Also: ఆడియన్స్ కు అదిరిపోయే వీకెండ్… ఏకంగా 8 సినిమాలు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే