E-Paper
Advertisement

Banking Malware: ఒటిపి లేకుండానే బ్యాంక్ డబ్బు దొంగిలించే కొత్త మాల్వేర్.. ఎలా పనిచేస్తుందంటే

Banking Malware: ఒటిపి లేకుండానే బ్యాంక్ డబ్బు దొంగిలించే కొత్త మాల్వేర్.. ఎలా పనిచేస్తుందంటే
Advertisement

Banking Malware| ప్రజల డబ్బులు దోచుకునేందుకు సైబర్ దొంగలు చాకచక్యంగా ఊహించని కొత్త పద్ధతుల్లో అవలంబిస్తున్నారు. ఈ సారి ఒక ప్రమాదకరమైన కొత్త మాల్వేర్ తో బ్యాంక్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మాల్వేర్ పేరు ఆల్బిరియోక్స్ (Albiriox). ఒక్కసారి ఈ మాల్వేర్ ఈ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లాంటి డివైజ్ లలో ప్రవేశిస్తే.. OTP అవసరం లేకుండానే సైబర్ దొంగలు బ్యాంక్ అకౌంట్‌లోకి దూరి మొత్తం దోచుకుంటున్నారు.

ఈ ప్రమాదాన్ని మొదటిసారిగా Cleafy అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ గుర్తించింది. ఇది ఫేక్ మొబైల్ యాప్స్ ద్వారా రహస్యంగా వ్యాపిస్తుంది.

హ్యాకర్లు దీన్ని ఎలా పంపిస్తారు?

Advertisement

హ్యాకర్లు నార్మల్ యాప్స్ లాగా కనిపించే ఫేక్ APK ఫైల్స్ సృష్టిస్తారు. వాటిని వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా మెసేజెస్‌లో లింక్స్ పంపుతారు. కొన్ని ఫేక్ ప్లే స్టోర్ పేజీలు కూడా ఉంటాయి. మీరు ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా “అన్‌నోన్ సోర్సెస్” ఆన్ చేసి ఆ ఫైల్స్ ఇన్‌స్టాల్ చేస్తే మాల్వేర్ మీ డివైజ్ లోపలికి వచ్చేస్తుంది.

Albiriox ఎలా పని చేస్తుంది?

ముందు ఒక చిన్న ఇన్‌స్టాలర్ యాప్ వస్తుంది. మీరు దాన్ని నమ్మి ఇన్‌స్టాల్ చేస్తే నోటిఫికేషన్ మీకు చేరకుండా దాచిన ట్రోజన్ డౌన్‌లోడ్ అవుతుంది. ఆ ట్రోజన్ ఫోన్‌ని పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. బ్యాంకింగ్ యాప్స్, UPI, క్రిప్టో వాలెట్స్.. ఇవన్నీ ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే 400కి పైగా ఫేక్ యాప్స్ గుర్తించారు.

మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

Advertisement

ఆల్బిరియాక్స్ చాలా స్మార్ట్‌గా పని చేస్తుంది. డబ్బు పోయే వరకు మీకు ఎలాంటి అలర్ట్ రాదు. బ్యాంక్ నుంచి మెసేజ్ లేదా నోటిఫికేషన్ రాదు. ఇది “Malware-as-a-Service” మోడల్‌లో ఉంటుంది. డార్క్ వెబ్‌లో హ్యాకర్లు దీన్ని సబ్‌స్క్రిప్షన్‌లా కొనుగోలు చేసి ఉపయోగిస్తారు. ముఖ్యంగా రష్యన్ హ్యాకర్లు ఈ మాల్వేర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు రిపోర్ట్.

ఈ జాగ్రత్తలు పాటించండి

ప్లే స్టోర్ తప్ప ఇతర చోట్ల నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేయకూడదు
ఫోన్‌లో అన్‌నోన్ సోర్సెస్ (Unknown Sources) ఆప్షన్ ఎప్పుడూ ఆఫ్‌లోనే ఉంచండి
వాట్సాప్, SMSలో వచ్చిన లింక్స్‌ గురించి బాగా ఆలోచించి క్లిక్ చేయండి
ఫోన్ సాఫ్ట్‌వేర్ ఎప్పుడూ అప్డేట్ చేస్తూ లేటెస్ట్ వెర్షన్‌లో ఉంచండి
Kaspersky, Bitdefender, Avast లాంటి మంచి యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేయండి
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రోజూ చెక్ చేస్తూ ఉండండి

మీరు చేసే ఒక్క తప్పుడు క్లిక్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది. ఇప్పుడే ఫోన్ సెట్టింగ్స్ అన్నీ సరిగా చెక్ చేసి జాగ్రత్తగా ఉండండి.

Also Read: ఇన్‌స్టామార్ట్‌ని మోసం చేసిన కస్టమర్.. ఏఐ ఫోటో చూపించి దోపిడీ

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×