BigTV English

Upasana – Ramcharan : మెగా కంపౌండ్‌లో డబుల్ కన్ఫ్యూజన్.. ఈ పజిల్ వెనుక రహస్యం ఏంటి ?

Upasana – Ramcharan : మెగా కంపౌండ్‌లో డబుల్ కన్ఫ్యూజన్.. ఈ పజిల్ వెనుక రహస్యం ఏంటి ?
Advertisement

Upasana -Ramcharan: మెగా అభిమానులకు పండుగ లాంటి శుభవార్తను ఉపాసన వెల్లడించిన సంగతి తెలిసిందే. నేడు ఈమె సోషల్ మీడియా వేదికగా తన సీమంతపు వేడుకలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తాను రెండోసారి తల్లి కాబోతున్నాననే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇలా ఉపాసన మరోసారి తల్లి కాబోతుందనే విషయం తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ వేడుకలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఘనంగా ఈ సీమంతపు వేడుకలను నిర్వహించారని తెలుస్తోంది.. ఇక ఈ వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..


కవలలకు జన్మనివ్వబోతున్నారా?

ఈ దీపావళి పండుగకు డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ ఉపాసన ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె మరోసారి తల్లి కాబోతుందని, ఖచ్చితంగా ఈసారి వారసుడు పుడతారని అభిమానులు భావిస్తున్నారు అయితే తాజాగా ఉపాసన చేసిన పోస్ట్ పై మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాకుండా మెగా అభిమానులను కూడా కన్ఫ్యూషన్ లో పడేస్తోంది. ఉపాసన డబుల్ సెలబ్రేషన్స్ అంటూ చెప్పడంతో ఈసారి ఉపాసన కవల పిల్లల(Twin Babies)కు జన్మనివ్వబోతోందా?  అనే సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా మెగా ఇంట్లోకి ఒకరు కాదు ఇద్దరు వారసులు రాబోతున్నారంటూ ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.

ఈ డబుల్ కన్ఫ్యూజన్ ఏంటీ బాసూ?

ఇలా ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎలాంటి నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే ఉపాసన డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పడంతో ఆమె కవలలకు జన్మనివ్వబోతోందని అర్థం కాదు. దీపావళి పండుగ రోజే ఆమె సీమంతపు వేడుకలు(Baby Shower Ceremony) కూడా జరుగుతున్న నేపథ్యంలో డబుల్ సెలబ్రేషన్స్ అంటూ చెప్పుకోవచ్చారు.డబుల్ బ్లెస్సింగ్స్ అంటే.. రెండోసారి తల్లిదండ్రులుగా మారబోతున్న నేపథ్యంలో అలా చెప్పారని మరికొందరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


మొదటి సంతానంగా అమ్మాయి..

ఏది ఏమైనా ఉపాసన చేసిన ఈ పోస్ట్ మెగా అభిమానులలో ఎన్నో సందేహాలను కలిగిస్తోంది. ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారనే విషయం మాత్రం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఉపాసన రాంచరణ్ వివాహమైన 11 సంవత్సరాలకు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మరో బిడ్డ కావాలనే ఆలోచనలో ఈ జంట ఉండరని అందరూ భావించారు కానీ ఉపాసన మాత్రం ఇలా తన రెండో ప్రెగ్నెన్సీ గురించి గుడ్ న్యూస్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఉపాసన రాంచరణ్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: OG OTT : ఓజీ ఓటీటీలోకి అయితే వచ్చింది.. కానీ, పవన్ ఫ్యాన్స్‌నే హర్ట్ చేశారు

Related News

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Actress Son Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కుమారుడు కన్నుమూత?

Big Stories

×