IND VS AUS 2ND ODI: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీం ఇండియాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియాకు రెండో వన్డే లో కూడా ఘోర పరాభవం ఎదురయింది. ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 2 వికెట్ల తేడాతో రెండో వన్డేలో కూడా ఓడిపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే 2-0 తేడాతోటీమిండియా పై 3 వన్డేల సిరీస్ ను సొంతం చేసుకుంది కంగారు జట్టు. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యార్, హర్షిత రానా టీమిండియా విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. అయినప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విజయం సాధించింది. 46.2 ఓవర్లలో ఇండియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది.
అడిలైడ్ వేదికగా ఓడిపోయిన టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసుకుంది. 17 సంవత్సరాల తర్వాత ఈ వేదికగా తొలి ఓటమి చవిచూసింది టీమిండియా. అడిలైడ్ వేదికగా ఇప్పటి వరకు టీమిండియా 15 వన్డేలు ఆడింది. ఇందులో తొమ్మిది మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దాదాపు 17 సంవత్సరాలుగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రికార్డ్ కొనసాగిస్తోంది టీమిండియా. అయితే ఆ అరుదైన రికార్డు ఇప్పుడు టీమిండియా బ్రేక్ చేసింది. 17 సంవత్సరాల తర్వాత అడిలైడ్ వేదికగా గిల్ కెప్టెన్సీ లోని టీమిండియా ఓటమి మూటగట్టుకుంది.
ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ను ఆడిస్తే ఖచ్చితంగా టీమిండియా గెలిచేదని అంటున్నారు. అదే సమయంలో టీమిండియా ఫీల్డింగ్ కూడా మైనస్ గా మారింది. రెండు అమూల్యమైన క్యాచ్‌లను మహమ్మద్ సిరాజ్ అలాగే అక్షర్ పటేల్ ఇద్దరు కూడా వదిలేశారు. సింగిల్స్ రాణి చోట కూడా సింగిల్స్ వచ్చేలా చెత్త ఫీల్డింగ్ చేశారు. అలాగే బౌండరీ వద్ద డ్రైవ్ చేసిన సిరాజ్, నాలుగు పరుగులు సమర్పించేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ అలాగే కెప్టెన్ శుభమాన్ గిల్ లాంటి ప్లేయర్లు కూడా ఇవాళ విఫలం కావడంతో టీమిండియా ఓడిపోయిందని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రెండు సార్లు విరాట్ కోహ్లీ డకౌట్ కావడం దారుణం అంటున్నారు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో మెరిశాడు కానీ విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అతడు క్లిక్ అయి ఉంటే, మ్యాచ్ స్వరూపం మారిపోయాయి. సిరీస్ సమం అయ్యేది. దీంతో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలని కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే రెండు వన్డేలు పూర్తయ్యాయి. అక్టోబర్ 25వ తేదీన టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా మూడవ వన్డే జరగనుంది. ఇందులోనైన టీమ్ ఇండియా గెలిస్తే పరువు నిలుస్తుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ లో మెరిస్తేనే 2027 వరల్డ్ కప్ ఆడతాడు.
Brain dead captaincy by Shubman Gill 🤡
How can you keep Siraj at point??
He just dropped a crucial catch of set batsman short. pic.twitter.com/09WlsFl0N7
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) October 23, 2025