OG OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజాగా ఓజి సినిమా(OG Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుజిత్(Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇలా థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ (Net Flix) లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా డిజిటల్ మీడియా హక్కులను భారీ ధరలకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమాని నేటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమాని విడుదల చేసినప్పటికీ పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా నుంచి తొలగించిన సన్నివేశాలను తిరిగి సినిమాలో జోడించి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తారని అందరూ భావించారు.
ఇలా సినిమా నుంచి తొలగించిన సన్నివేశాలను కూడా నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చని అభిమానులు భావించారు కానీ థియేటర్లో ఏ విధంగా అయితే ఈ సినిమాని ప్రసారం చేశారో ఓటీటీలో కూడా అదేవిధంగా ప్రసారం చేసిన నేపథ్యంలో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలగించిన సన్నివేశాలతో సహా సినిమాని విడుదల చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రేక్షకుల డిమాండ్ మేరకు నెట్ ఫ్లిక్స్ తొలగించిన సన్నివేశాలతో సహా సినిమాని విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.
ఉస్తాద్ భగత్ సింగ్..
పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఇలా చాలా సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ హిట్ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూశారు. ఓజీ సినిమా పవన్ అభిమానుల ఆకలిని తీర్చిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఓజీ యూనివర్స్ మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ నానితో కలిసి బ్లడీ రోమియో సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన వెంటనే ఓజి సీక్వెల్ పనులు ప్రారంభం కానున్నాయని దర్శకుడు వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Mohan Babu: బావ నువ్వు పెళ్లి చేసుకుని అర డజను మంది పిల్లలతో సంతోషంగా ఉండాలి!