జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్ అనంతరం కూటమి నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. తనదైన సహజ శైలిలోల జగన్ ప్రెస్ మీట్ పై సెటైర్లు పేల్చారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. జగన్ ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదని, అసెంబ్లీకి రావాలని ఆయన సూచించారు. సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలంటే మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావాలని చెప్పారాయన. ప్రెస్ మీట్ లో ప్రస్తావించినాట్టే అసెంబ్లీలో కూడా ప్రజల అంశాలను ఆయన ప్రస్తావించవచ్చు అని సలహా ఇచ్చారు.
అనర్హత వేటు పడుతుందా?
వరుసగా జగన్ శాసన సభ సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే గవర్నర్ ప్రసంగాలకు మాత్రం ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి హాజరవుతున్నారు. అలా ఆయన అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. వరుసగా 60 పని దినాలు హాజరు కాకపోతే అతని సభ్యత్వం రద్దు చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. మరి ఏపీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్ డిమాండ్ చేస్తూ అది ఇచ్చే వరకు సభకు రానని తేల్చి చెబుతున్నారు. కనీస సీట్లు రాకుండా ప్రతిపక్ష నేత హోదా ఎందుకిస్తారంటూ కూటమి నేతలు లాజిక్ తీస్తున్నారు. హోదా అనేది ప్రజలు ఇచ్చేదని, ప్రభుత్వం ఇచ్చేది కాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో జగన్ అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తాజా ప్రెస్ మీట్ పై రఘురామ కృష్ణంరాజు స్పందించడం విశేషం. వచ్చే అసెంబ్లీ సమావేశాల రోజులను బట్టి అనర్హత పరిధిలోకి జగన్ వస్తారా లేదా అనేది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వరుసగా 60 పనిదినాలు హాజరు లేకపోతే రాజ్యాంగం చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
జగన్ ప్రాబ్లమ్ ఏంటి?
అసెంబ్లీకి వస్తే నాకు మైక్ ఇవ్వరు, ఇచ్చినా ఎక్కువ టైమ్ మాట్లాడనివ్వరు అనేది జగన్ వాదన. అదే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, సభా నాయకుడుతోపాటు తనకు కూడా తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని జగన్ అంటున్నారు. ఇదంతా అపోహేనని, జగన్ కి తగినంత సమయం ఇస్తామని అంటున్నారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్. ప్రతిపక్ష నేత అనే హోదాకు, అసెంబ్లీకి రాకపోవడానికి మధ్య సంబంధం ఏంటని నిలదీస్తున్నారు. కనీసం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలనయినా అసెంబ్లీకి పంపించొచ్చు కదా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. పోనీ జగన్ టీమ్ ఎవరూ సభలకు రారు, రాబోరు అనుకుంటే.. అటు ఎమ్మెల్సీలు మాత్రం సమావేశాలకు వస్తున్నారు. ఎమ్మెల్సీలు సభలో, ఎమ్మెల్యేలు ఇంటిలో.. ఇదెక్కడి లాజిక్కో జగనే ఆలోచించుకోవాలని అంటున్నారు సామాన్య ప్రజలు. మరి ఇకనైనా జగన్ ప్రెస్ మీట్లకు స్వస్తి చెప్పి, అసెంబ్లీలో తాడోపేడో తేల్చుకంటారేమో చూడాలి.
Also Read: ఆయనకు న సిగ్గు.. న లజ్జ.. జగన్ ఘాటు వ్యాఖ్యలు
జగన్ ప్రెస్ మీట్ లో నాలుగు కీలక అంశాలు మాట్లాడారు. ఏపీలోని కల్తీ లిక్కర్ వ్యవహారం, వైజాగ్ లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్, రైతులు, ఉద్యోగుల తరపున జగన్ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చారు. దీంతో కూటమి నుంచి అంతే వివరంగా కౌంటర్లు మొదలయ్యాయి.
Also Read: ఆ ఘనత మాదే.. వైజాగ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై జగన్ యూ టర్న్