E-Paper
Advertisement

Ustaad Bhagath Singh Collections: ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ ఈవెన్ ఇక అసాధ్యమేనా..!

Ustaad Bhagath Singh Collections: ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ ఈవెన్ ఇక అసాధ్యమేనా..!
Advertisement

Ustaad Bhagath Singh Collections:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది సందర్భంగా భారీ అంచనాల.. మధ్య విడుదలైంది. మొదటి రోజు థియేటర్లలో మంచి ఓపెనింగ్ రావడంతో అభిమానుల్లో హర్షం కనిపించింది. అయితే రెండో రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు తగ్గడం.. ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

తొలి రోజు ఈ చిత్రం మంచి స్థాయిలో వసూళ్లు సాధించింది. కానీ రెండో రోజు కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్కింగ్ డే కావడం, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ రావడం ఈ డ్రాప్‌కు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం సినిమా గురించి చర్చ ఎక్కువగా ఉన్నా, సాధారణ ప్రేక్షకుల్లో స్పందన అంతగా బలంగా లేదు.

Advertisement

ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టిన సంగతి తెలిసిందే. అందువల్ల ఈ చిత్రం హిట్ కావాలంటే పెద్ద మొత్తంలో వసూళ్లు రావాలి. ట్రేడ్ అంచనాల ప్రకారం, బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే చాలా పెద్ద టార్గెట్‌ను అందుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే ఆ లక్ష్యం చేరుకోవడం కష్టంగా కనిపిస్తోంది.

మొదటిరోజు రోజు ఈ సినిమా రూ.34.75 కోట్ల నెట్ వసూలు చేయగా, రెండో రోజు కేవలం రూ.9.25 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు రూ.140 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అయితే, ఈరోజు నుంచి ధురంధర్ 2 తెలుగు వెర్షన్ విడుదల కావడంతో.. పోటీ మరింత పెరిగింది. పైగా పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాను ప్రశంసించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి థియేటర్లలో స్క్రీన్లు తగ్గే అవకాశముంది.

Advertisement

వీకెండ్ రోజులు ఈ సినిమాకు చాలా కీలకం. శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్లు వస్తే పరిస్థితి కొంత మెరుగవుతుంది. లేదంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవడం మరింత కష్టమవుతుంది. ఇప్పటి పరిస్థితి చూస్తే ఈ సినిమా ముందున్న రోజులు చాలానే పరీక్షించేలా ఉన్నాయి.

మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ తరువాతి రోజుల్లో వచ్చిన పడిపోయిన వసూళ్లు ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు పెద్ద సవాలుగా మారాయి. ఇప్పుడు ఈ సినిమా భవితవ్యం పూర్తిగా వచ్చే రోజుల్లో వచ్చే కలెక్షన్లపైనే ఆధారపడి ఉంది.

ALSO READ: Dhurandhar 2: మన తెలుగు సినిమా రికార్డ్ టచ్ చేయలేకపోయినా దురంధర్ 2

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×