Telangana BJP: బీజేపీలో ఆరడుగుల బుల్లెట్ సీఎం అభ్యర్ధిగా రెడీ అవుతోందా? సీఎం అభ్యర్థి వెలమ నేత ముఖ చిత్రంతో 2029 ఎన్నికల బరిలో బీజేపీ దిగనుందా? ఇంతకు ఆ బుల్లెట్ ఎవర? బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావేనా? లేక బీజేపీలో ఇంకేదైనా సర్‌ప్రైజ్ ఆరడుగుల వెలమ బుల్లెట్ ఉందా? ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వాఖ్యల వెనక మర్మం ఏంటి..? హరీష్ రావు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారా..? హరీష్ రావుకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా హై కమాండ్ హామీ ఇచ్చిందా? అసలు పైడి రాకేష్ రెడ్డి ఏమన్నారు? దానిపై జరుగుతున్న చర్చేంటి?
బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2029లో తెలంగాణలో ఏర్పడబోయేది హిందూ ప్రభుత్వమేనని, బీజేపీలో ఆరడుగులు ఉన్న ఒక వెలమ నేత ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తానే హోంమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాషాయ దళంలో ముఖ్యమంత్రి అయ్యేంత చరిష్మా ఉన్న వెలమ నేత ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాషాయ పార్టీలో వెలమ నేతలున్నప్పటికీ సీఎం అయ్యే స్థాయి వారికి ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. మరి ఆ ఆరడుగుల బుల్లెట్ ఎవరై ఉంటారనేది అందరి మెదళ్లను తెలుస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలెవరైనా కాషాయ పార్టీలోకి వస్తారా? దానికి సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయా? అందులో భాగంగానే పైడి ఈ వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు
రాకేశ్‌రెడ్డి కామెంట్స్‌తో 2029 ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిపై బీజేపీలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. బీజేపీ భవిష్యత్ నాయకత్వంపై పెద్ద డిబేట్‌కు దారి తీస్తుందట. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి వెలమ కమ్యూనిటీ, ఆరడుగుల బుల్లెట్ అంటూ పైడి రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో వెలమ కమ్యూనిటీ అంటే, ముందుగా గుర్తొచ్చేది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తన్నీరు హరీష్ రావులే. ఇప్పుడు అదే వర్గం నుంచి ఒక నాయకుడిని బీజేపీ సీఎం ఫేస్‌గా ప్రొజెక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ ఫాలోయింగ్, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉన్న హరీష్ రావు వెలమ కమ్యూనిటీలో బలమైనా నేతగా ఉన్నారు. కుటుంబ కలహాలు, కవిత లిక్కర్ స్కాం కేసుతో పార్టీ రెండుగా చీకడం, కవిత రెబల్ గా మారి హరీష్ రావుపై దుమ్మెత్తి పోస్తుండంతో ఆయన ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారంట. గతం నుంచి కూడా హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలున్నాయి. ఈ నేపద్యంలో బీజేపీ ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావును తమ వైపు లాక్కోవడానికిటార్గెట్ చేస్తుందా..? ఆయనకు పరోక్షంగా బీజేపీ డోర్ ఓపెన్ అని సిగ్రెల్ ఇస్తున్నారా.? అందులో భాగంగానే హరీష్ రావు పేరు ఫోకస అవుతుందా? అన్న చర్చ జరుగుతుంది.
అంతేకాదు పైడి రాకేష్ రెడ్డి వాఖ్యలతో కాషాయ పార్టీలో భారీ పవర్ గేమ్ నడుస్తోందన్న టాక్ సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో సీఎం రేస్‌లో పలువురు నేతలు పోటీలో ఉన్నారు. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల తో పాటు మరికొంత మంది సీనియర్ నేతలు తెర మీద ఉన్నారు. ఈ సమయంలో వెలమ సీఎం అనే వాదనను పార్టీలో తీసుకురావడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీలో బీసీలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ ఆదేశాల మేరకు బీసీ సీఎం కార్డ్‌ను బీజేపీ బలంగా వాడింది. కానీ అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. తెలంగాణలో బీసీ ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉండటం వల్లనే బీసీ సీఎం నినాదం వర్క్‌ఔట్ అవుతుందని కమలదళం భావించింది. దానికి తోడు కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించకపోవడంతో అది తమకు కలిసొస్తుందని భావించి బీసీ సీఎం నినాదాన్ని కాషాయ పార్టీ ఎత్తుకుంది. కానీ దేశంలో బీసీ ప్రధానిగా ఉన్నా.. తెలంగాణలో మాత్రం కమల దళానికి బీసీ సీఎం నినాదం ఏమాత్రం వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు నేపథ్యంలో బీజేపీ స్టాండ్ మార్చుకుంటుందా? అన్న చర్చ నడుస్తోంది.
ఆరడుగుల వెలమ నేతలు బీజేపీలో లిమిటెడ్ గానే ఉన్నారు. అయితే, గతంలో టికెట్ కూడా అలాంటి నేతలకు బీజేపీ సీఎం ఛాన్స్ ఇస్తుందా..? బీజేపీ హైకమాండ్ ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటుందా..? అన్నది అనుమానమే. మరోవైపు బీజేపీ నేతలు కావాలనే బీఆర్‌ఎస్ కోర్ ఓటు బ్యాంక్‌ను బ్రేక్ వేసేందుకు, బీఆర్ఎస్ ప్లేస్‌ను కైవసం చేసుకునేందుకు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని చెప్పుకునేందుకు, వెలమ కమ్యూనిటీ నుంచి లీడర్‌ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా..? లేక బీఆర్‌ఎస్ నుంచి పెద్ద లీడర్‌ను తీసుకురావాలనే ప్రయత్నమా..? అన్న అంశాలు అంతుపట్టకుండా తయారయ్యాయి. వెలమ నేతకు సీఎం పోస్ట్ ఆఫర్‌తో బీజేపీ రాజకీయ సమీకరణలు తన వైపుకు తిప్పుకునేందుకు ప్లాన్ మొదలుపెట్టిందా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి హరీష్ రావే అన్నది బీజేపీ అధికారిక స్టాండ్ కాకపోవచ్చని, చీకట్లో బాణం వేసినట్లు ఇచ్చిన స్టేట్‌మెంట్ అయి ఉండొచ్చంటున్నారు. అసలు పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయమా..? లేక పార్టీ భవిష్యత్ వ్యూహానికి ఇది సంకేతమా..? ఆరడుగుల బీజేపీ బుల్లెట్ ఎవరు అన్న ప్రశ్నలకు ఆ పార్టీ వర్గాలతో పాటు, పొలిటికల్ వర్గాల్లో ఇప్పటికైతే సమాధానం లేదు. మొత్తానికి ఆర్మూర్ ఎమ్మెల్యే వాఖ్యలు మాత్రం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఏదేమైనా పైడి రాకేష్ రెడ్డి చిట్ చాట్ పేరుతో చేసిన కామెంట్స్ బీజేపీలో పెద్ద చర్చ రచ్చను రాజేసినట్టయింది. బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్లిన పార్టీ ఇప్పుడు వెలమ కార్డు తీసుకురావడం వ్యూహాత్మకమా? లేక అంతర్గత గందరగోళానికి సంకేతమా..? అన్నది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద బీజేపీ ఆరడుగుల బుల్లెట్ ఎవరనేది బర్నింగ్ టాపిక్‌గా మారిందిప్పుడు.
Story By AppaRao, Big Tv
Also Read: Raashi Khanna: ఆ సీన్ సమయంలో గొడవ.. మధ్యలో వెళ్లిపోదామనుకున్నాను.. రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు