Irfan Pathan On CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీన అంటే మరో ఏడు రోజుల్లోనే ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. విదేశీ ప్లేయర్లు అందరూ కూడా ఇప్పటికే తమ జట్టు శిబిరంలో చేరిపోయి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni) తప్పుకుంటే బెటర్ అని.. అతని ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్లకు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan). ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును కూడా ప్రకటించారు. దీంతో ఇర్ఫాన్ పఠాన్ పై మహేంద్ర సింగ్ ధోని అభిమానులు సీరియస్ అవుతున్నారు.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK) యంగ్ స్టార్ లతో నిండుతుందని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో 44 సంవత్సరాల వయసు ఉన్న మహేంద్ర సింగ్ ధోని తుది జట్టులో నామమాత్రంగా ఆడడం ఎందుకని నిలదీశారు. అతని స్థానంలో యంగ్ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ ఇలాంటి ప్లేయర్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని తుది జట్టులో ఉండి చివరి 1 లేదా 2 ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్నాడు.. దానివల్ల చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒరిగేది ఏమీ లేదని మండిపడ్డారు. మహేంద్ర సింగ్ ధోని ఆడాలనుకుంటే కచ్చితంగా ఐదు ఓవర్లు ఉండగానే బ్యాటింగ్ చేయాలని కోరారు ఇర్ఫాన్ పటాన్. అప్పుడే చెన్నై మ్యాచ్ చూసేందుకు వచ్చినా జనాలకు మంచి ట్రీట్ అందుతుందని ఈ వ్యాఖ్యానించారు.
అలా కాదని ఒకటి లేదా రెండు ఓవర్లు ఉన్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తే, వర్కౌట్ కాదని చురకలు అంటించారు. అలాంటప్పుడు మహేంద్ర సింగ్ ధోని పక్కకు తప్పుకొని కుర్ర క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. 44 సంవత్సరాలు ఉన్న మహేంద్ర సింగ్ ధోని డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉండి, సంజు శాంసన్, ఋతురాజ్ గైక్వాడ్ లాంటి క్రికెటర్లకు సలహాలు సూచనలు ఇస్తే బెటర్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇర్ఫాన్ పఠాన్. అటు తన ప్లేయింగ్ 11 లో మహేంద్రసింగ్ ధోనీకి అవకాశం ఇవ్వలేదు ఇర్ఫాన్ పఠాన్. ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా మహేందర్ సింగ్ ధోనికి అవకాశం ఇవ్వకుండా ఖలీల్ అహ్మద్ కు ఇచ్చాడు. దీంతో ఇర్ఫాన్ పఠాన్ పై మహేంద్ర సింగ్ ధోని అభిమానులు మండిపడుతున్నారు.
🚨 IRFAN PATHAN ON MS DHONI 🚨
Irfan Pathan Said 🗣️
"If Dhoni plays only in the last two overs, then I’d say it would be better if he doesn’t play much this season and gives the youngsters more chances. But if Dhoni plays the full season and comes in to bat at least four or… pic.twitter.com/FVT6W5415w
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 21, 2026