Iswarya Menon:ప్రస్తుత కాలంలో నటన ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఆవగింజంతైనాఉండాలి అని ఎంతోమంది నిరూపిస్తున్నారు కూడా.. ముఖ్యంగా అదృష్టం ఉంటే ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలు అయిపోయిన వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా.. ఆ అదృష్టం లేక.. సరైన పాత్ర దొరకక.. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే కొనసాగుతున్నారు. అందుకే అదృష్టం కోసం హీరోయిన్స్ పడే పాట్లు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. ఇకపోతే అందులో భాగంగానే ఇక్కడ ఒక హీరోయిన్ సక్సెస్ పొందడం కోసం చేసిన పనికి.. నెటిజన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. మరి ఆమె ఎవరు? ఏం చేసింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) .తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ఐశ్వర్య.. తాజాగా కొన్ని సెల్ఫీ ఫోటోలు షేర్ చేసుకుంది. అందులో ఆమె మెడలో వేసుకున్న డ్రీమ్ క్యాచర్ కారణంగానే ఇప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటుంది. సాధారణంగా డ్రీమ్ క్యాచర్ ను ఎక్కువగా ఇంటిలో లేదా బెడ్ రూమ్లో నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమేయడానికి గోడకు తగిలిస్తూ ఉంటారు. కానీ ఈమె ఏకంగా డ్రీమ్ క్యాచర్ ను మెడలో వేసుకొని సెల్ఫీ ఫోటోలు షేర్ చేసింది.
ఇది చూసిన నెటిజన్స్ సక్సెస్ కోసం ఏమైనా చేస్తారా? ఆఖరికి గోడకుండాల్సింది మెడలో కూడా వేసుకుంది.. ఇంకా వేరే చోటే లేదా అంటూ ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరికొంతమంది నీపై అంత నెగటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది.. నర ద్రిష్టి దూరం చేయడం కోసం డ్రీమ్ క్యాచర్ మెడలో వేసుకున్నావా ? అంటూ పలు రకాల ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఒక డ్రీమ్ క్యాచర్ తో వైరల్ గా మారింది ఐశ్వర్య మీనన్. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Actress Ramya: రమ్య కేస్.. 12 మంది దర్శన్ ఫాన్స్ పై ఛార్జిషీట్!
ఐశ్వర్య మీనన్ విషయానికి వస్తే.. తమిళ్ , మలయాళం భాషల్లో చిత్రాలు చేస్తూ కెరియర్ను కొనసాగిస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఈమెకు పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. చేసిన ఒక్క సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అదే స్పై మూవీ.. తెలుగులో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharth) హీరోగా వచ్చిన స్పై చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్ లభించలేదు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ ‘భజే వాయువేగం’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా నిరాశ మిగిల్చింది. అందులో భాగంగానే నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ఈమె.. తెలుగులో సక్సెస్ రావడం కోసం ఇలా డ్రీమ్ క్యాచర్ వేసుకుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి తీరిపై ఐశ్వర్య ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.