AP Liquor Scam: ములకలచెరువు కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్ధన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు రాజకీయ ప్రకంపనలకు కారణమైన ఈ కేసులో ఇది కీలక పరిణామంగా తెలుస్తోంది. ఇంతకీ జనార్దన్ అసలు గుట్టు విప్పుతారా? దీని వెనకున్న పెద్దల పేర్లు చెబుతారా? అనేది ఉత్కంఠగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా ములకలచెరువులో జరిగిన నకిలీ మద్యం తయారీ, అమ్మకాల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ‘కింగ్‌పిన్’గా పేరుపొందిన టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధన్ రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు నాలుగు నెలలుగా కొనసాగుతోంది.. ఇప్పటికే 12 మంది నిందితులు అరెస్టయ్యారు. మొత్తం నిందితుల సంఖ్య 23కి చేరింది.
అయితే జనార్ధన్ రావు, అతని అనుచరుడు కట్టా రాజు కలిసి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ నకిలీ మద్యం యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారు చేసిన కల్తీ మద్యాన్ని ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని బాట్లింగ్ యూనిట్‌లో ప్రాసెస్ చేసి, గోల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా వంటి ప్రసిద్ధ బ్రాండ్ల లేబుల్స్‌తో వేలాది క్వార్టర్ బాటిళ్లలో నింపారు. హోలోగ్రామ్ స్టికర్లు, మూతలు బిగించే యంత్రాలు, కార్టన్లు సహా అన్ని ఒరిజినల్‌లా చేసి, దుకాణాలు, బెల్ట్ షాపులకు అమ్మారు. పోలీసుల దాడుల్లో రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు. జనార్ధన్ సోదరుడు జగన్మోహన్ రావు కూడా ఈ దందాలో భాగమై, ఇప్పటికే అరెస్టయ్యాడు.
అక్టోబర్ 10న దక్షిణాఫ్రికా నుంచి ముంబై మీదుగా ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనార్ధన్‌ను ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న ఆఫ్రికాకు వెళ్లిన జనార్ధన్, తన సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేసి పోలీసుల దృష్టిని ఆకర్షించుకున్నాడు. ముందుగానే గన్నవరం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అరెస్టు తర్వాత జనార్ధన్‌ను రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. మూడు రోజుల కస్టడీకి పిటిషన్ వేసిన పోలీసులు, తంబళ్లపల్లె కోర్టులో విచారణ 13వ తేదీకి మొదలవుతుంది.
జనార్ధన్ టీడీపీ నేతగా, రాష్ట్ర స్థాయి నాయకుల అండతో ఈ దందాన్ని నడిపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తంబళ్లపల్లె ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి (ఏ-17) కూడా ఈ కేసులో చేర్చబడ్డాడు. ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, డ్రైవర్ అష్రఫ్, బెంగళూరు నివాసి బాలాజీ, సుదర్శన్, హైదరాబాద్‌కు చెందిన నకిరికంటి రవి వంటి తొమ్మిది మంది కొత్తగా నిందితులుగా చేర్చాడు. ఇటీవల ఏ-2 కట్టా నాగరాజు, ఏ-12 కొడాలి శ్రీనివాస్‌లు అరెస్టయ్యారు. జయచంద్రారెడ్డిని అరెస్టు చేయడానికి బెంగళూరులో ప్రత్యేక బృందాలు మకాం వేశాయి. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జనార్ధన్, జయచంద్రారెడ్డి డిస్టిలరీలు నడుపుతున్నారని తెలుస్తోంది.
అయితే జనార్ధన్ తరపు న్యాయవాది రవీంద్ర ఈ అరెస్టును ఖండించారు. “సౌతాఫ్రికా నుంచి వచ్చి, కేసులో తనకు సంబంధం లేదని చెప్పడానికే వచ్చాడు. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చాము, కానీ పట్టించుకోకుండా పట్టుకున్నారు” అని ఆరోపించారు. “వేరే పేర్లు చెప్పించడానికే ఇలా చేశారు. స్కెచ్ వేసి కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆర్భాటు చేశారు. ప్రతిరోజూ తనిఖీల్లో ఎందుకు పట్టుకోలేదని పోలీసులు ప్రశ్నించడాన్ని కూడా రవీంద్ర తప్పుబట్టారు. జనార్ధన్ ఏ1గా ఉన్నప్పటికీ, తనకు ఎటువంటి భాగస్వామ్యం లేదని న్యాయవాది చెబుతున్నారు.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!
పోలీసులు జనార్ధన్‌ను రహస్యంగా విచారిస్తూ, మిగతా నిందితులను కస్టడీలోకి తీసుకుంటామని చెబుతున్నారు. జైలులో ఇప్పటికే 10 మంది నిందితులు ఉన్నారు. ఈ కేసు వెనుక రాష్ట్ర స్థాయి వివిధ పార్టీల నాయకుల అండ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. జనార్ధన్ గుట్టు విప్పితే, మరిన్ని పెద్ద పేర్లు బయటపడతాయని, రాజకీయంగా తీవ్ర ప్రభావం పడుతుందని వర్గాలు చెబుతున్నాయి.
నకిలీ మద్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు..
ప్రధాన నిందితుడు జనార్ధన్ రావును విజయవాడలోని రహస్య ప్రదేశంలో విచారిస్తున్న పోలీసులు
గన్నవరం విమానాశ్రయం నుంచి రహస్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళిన పోలీసులు
జనార్ధన్ రావు నోరు విప్పితే మరికొందరు నాయకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం… https://t.co/GBBW3mQMF4
— BIG TV Breaking News (@bigtvtelugu) October 11, 2025