Rohit Sharma Car: టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతడు గ్రౌండ్ లో దిగితే విధ్వంసమే. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగాడు అంటే, అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలర్ ఎవరన్నది ? అస్సలు చూడడు. కొడితే సిక్స్ లేదా బౌండరీ. అలా ఉంటుంది రోహిత్ శర్మ బ్యాటింగ్. అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్ ఎలా ఆడేవాడో? అచ్చం అలాగే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. అయితే అలాంటి రోహిత్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఏకంగా 4.57 కోట్ల లంబోర్ఘిని కారును ధ్వంసం చేశాడు. నిన్న ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారీ సిక్సర్ కొట్టాడు. అయితే అప్పుడు బంతి నేరుగా వెళ్లి తన కారు అద్దాలకు తగిలింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు, అయ్యో పాపం అంటున్నారు. తన కారును తానే కొట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ బ్యాట్ పట్టాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందుకే ఇన్ని రోజులు విదేశీ టూర్లకు వెళ్లిన రోహిత్ శర్మ, ఇప్పుడు మాత్రం బ్యాట్ పట్టి, సిక్సులపై సిక్స్ లు కొడుతున్నాడు. నిన్న ముంబైలోని శివాజీ పార్క్ లో దాదాపు 5 గంటల పాటు రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేశాడు. రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేసేందుకు శివాజీ పార్ కు వెళితే, క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. అతన్ని చూసేందుకు వేలాదిమంది వచ్చారు.
దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రాక్టీస్ వల్ల అతని కారు డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ భయంకర సిక్స్ కొట్టాడు. దీంతో నేరుగా ఆ బంతి వెళ్లి రోహిత్ శర్మకు సంబంధించిన లంబోర్గిని కారుకు తగిలిందట. దీంతో ముందు అద్దాలు పగిలినట్లు చెబుతున్నారు అభిమానులు. సిక్స్ కొట్టిన తర్వాత రోహిత్ శర్మ కూడా బాధపడడం వీడియోలో చూడవచ్చు. కాగా ఈ కారు ధర 4.57 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా టోర్నమెంట్ పూర్తి కాగానే వన్డేలకు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇద్దరు ఒకేసారి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
Rohit Sharma hit that six, it went straight and landed on his own Lamborghini.😂🔥 pic.twitter.com/LBINvmeDYc
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 10, 2025