E-Paper
Advertisement

ఇట్స్ అఫీషియల్… వాయిదా పడిన పెద్ది.. మళ్ళీ విడుదల ఎప్పుడంటే?

ఇట్స్ అఫీషియల్… వాయిదా పడిన పెద్ది.. మళ్ళీ విడుదల ఎప్పుడంటే?
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) హీరోగా బుచ్చిబాబు(Bucchi Babu) డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమా మార్చ్ 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన విడుదల కావాల్సి ఉండగా తరచు వాయిదా పడుతూ వస్తోంది. మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 30వ తేదీకి ఈ సినిమా వాయిదా పడింది అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ కూడా విడుదల కావడం లేదనీ, మళ్లీ వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఇలా ఈ సినిమా విడుదల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన నిర్మాతలు మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు.

మళ్లీ జూన్ నెలలోనే పెద్ది..

తాజాగా చిత్ర నిర్మాతలు పెద్ది సినిమా వాయిదా గురించి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా స్పందించారు. అనుకున్న విధంగానే ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీ వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. ఇలా ఏప్రిల్ 30వ తేదీ వాయిదా పడిన ఈ సినిమా జూన్ నెలలో విడుదల కాబోతుందని తెలిపారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి ఆదరణ లభించిందని, పెద్ది సినిమా పట్ల మీరు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు..

ఒక్కసాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి..

Advertisement

ఇక ఈ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తి అయ్యిందని కేవలం ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని చిత్రం నిర్మాతలు తెలిపారు. ఎడిటింగ్ సమయంలో ఈ సినిమా చూసామని చాలా మంచి అవుట్ ఫుట్ వచ్చిందని కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలియజేశారు. తాము చాలా మంచి సినిమా చేశామని, అయితే ఈ సినిమాని మరింత అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం, ప్రేక్షకులకు బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం టెక్నీషియన్లకు మరికొంత సమయం అవసరమైందని అందుకే ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీ నుంచి వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు.

Advertisement

ఇలా ఏప్రిల్ 30వ తేదీ వాయిదా పడిన ఈ సినిమా జూన్ నెలలో విడుదల కాబోతుందని, జూన్ నెలలో ఏ తేదీ విడుదల కాబోతుందనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇవ్వబోతున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇలా పెద్ది సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ మద్దతు మా సినిమాకు అవసరం అంటూ చిత్ర బృందం ఈ సందర్భంగా పెద్ది సినిమా వాయిదా పడిన విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఇలా వాయిదా పడిందనే విషయం చెప్పినప్పటికీ కొత్త విడుదల తేదీ చెప్పకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాని జూన్ 4 లేదా 26వ తేదీలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు వాయిదా పడటంతో జూన్ నెలలో విడుదల కావలసిన సినీ నిర్మాతలు సైతం అయోమయంలో పడ్డారని చెప్పాలి. మరి అనుకున్న విధంగానే జూన్ నెలలో అయినా పెద్ది తప్పకుండా వస్తారా? మళ్లీ వెనకడుగు వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: వరుణ్ తేజ్ కి ప్రమాదం..స్పందించిన నిహారిక..సర్జరీ సక్సెస్ అంటూ

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×