E-Paper
Advertisement

స్టేజీపైనే ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్….నెట్టింట వైరల్

స్టేజీపైనే ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్….నెట్టింట వైరల్
Advertisement

Payal Emotional : పాయల్ రాజ్‌పుత్ .. ఆర్‌ఎక్స్‌ 100తో కుర్రాళ్ళ గుండెల్లో గునపం దింపేసిన ఈ బోల్డ్ బ్యూటీ మంగళవారంతో తన నట విశ్వరూపాన్నే చూపెట్టింది. ఇక ప్రస్తుతమ్ కెరీర్‌లో కొంచెం డౌన్ ఫాల్ ఫేస్ చేస్తున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ తాజాగా జరిగిన ఒక సినీ ఈవెంట్‌లో స్టేజీపైనే బోరుమని ఏడ్చేయడం గమనార్హం. మరింతకీ ఈ హాట్ బ్యూటీ ఎందుకు కన్నీరు పెట్టుకుందో చూసేద్దాం!

ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పాయల్

Advertisement

మ్యాటర్‌లోకి ఎంట్రీ ఇస్తే.. సౌరబ్ ధింగ్ర హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న సినిమా  ‘ఫస్ట్ టైమ్ 01-01-01’. ఈ సినిమాకి హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వం వహిస్తూ సినిమాని నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరగగా ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పాయల్ అటెండ్ అయింది. ఇక ఈవెంట్‌లో అందరూ మాట్లాడి తమ విషెస్ చెప్పిన తర్వాత క్యూ అండ్ ఎ లో పాయల్ వంతు వచ్చింది.

క్యాన్సర్‌తో పోరాడిన తండ్రి.. తీరని లోటు

Advertisement

అయితే అదే సమయంలో మీడియా పాయల్‌ని హెల్త్ ఎలా ఉందంటూ అడగడంతో ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయింది. గత కొన్ని రోజులనుండి తన హెల్త్ బాగోలేదని, అందుకోసం జైపూర్‌లో పది రోజుల పాటు ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే తన హెల్త్ అప్‌డేట్ అవడం కంటే అదే సమయంలో తన తండ్రికి క్యాన్సర్ అన్న విషయం తెలిసిందంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి కళ్లలోకి నీళ్లు తెచ్చేసుకుంది.

also read :రికార్డుల రారాజు.. బయోపిక్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్! మైఖేల్ మేనియాకు బాక్సాఫీస్ షేక్!

తండ్రిని తలచుకుంటూ “నా లైఫ్‌లో రియల్ హీరో మా నాన్నే. ఆయన నా ప్రతి సినిమా కోసం ఎంతో క్యూరియస్‌గా ఎదురుచూసేవారు. ఇక నా చిత్రాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయనే. నేను ఏ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే” అని చెబుతూ స్టేజీపైనే ఏడ్చేసింది పాయల్.

తన తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ గత ఏడాది జూలై 28న క్యాన్సర్‌తో మరణించిన సంగతిని గుర్తు చేసుకుంటూ పాయల్ వెక్కి వెక్కి ఏడ్చింది. బాధ తట్టుకోలేక ఆమె వెంటనే వేదికపై నుంచి వెళ్లిపోవడం ఇక్కడ గమనార్హం.

వైరల్ అవుతున్న వీడియో

ఇక తండ్రిని తలుచుకుంటూ పాయల్ అలా ఏడవడంతో ఒక్కసారిగా ఆడిటోరియం సైలెంట్ అయిపోయింది. ఇక పాయల్‌ని ఎలా ఓదార్చాలో తెలియక అక్కడున్న వారంతా సైలెంట్ అయిపోయారు. ఇక పాయల్ ఏడుస్తున్న ఈ వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసి అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్, అందులో తండ్రి అంటే ఎమోషనల్ అవడం చాలా సహజం అంటూ సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కెరీర్ విషయానికి వస్తే..

ఇక పాయల్ సినిమాల విషయానికి వస్తే పంజాబీ సినిమాలతో కెరీర్ మొదలెట్టి, హిందీ సీరియల్స్‌లో నటించి, టాలీవుడ్‌లో ఆర్‌ఎక్స్‌ 100తో తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈమధ్యే ఆమె నటించిన పంజాబీ చిత్రం ‘ఖుష్ కబరీ’ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది కూడా. ఏది ఏమైనా ఎంత డబ్బు, సక్సెస్ ఉన్నా అవేవీ పోయిన వాళ్లని భర్తీ చేయలేదన్నది నిజం!

also read :అమ్మాయిల మనసు గెలవాలంటే ‘సిక్స్‌ ప్యాక్’ అక్కర్లేదు.. ఈ సీక్రెట్స్ తెలిస్తే చాలు!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×