E-Paper
Advertisement

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ.. ఒక్కమాటతో క్లారిటీ ఇచ్చిన మేనేజర్!

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ.. ఒక్కమాటతో క్లారిటీ ఇచ్చిన మేనేజర్!
Advertisement

Allu Arjun: సినిమా రంగానికి, రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని దశాబ్దాల నుంచి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలో దూసుకుపోతున్నారు. అంతేకాదు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కూడా అవతరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన తక్కువ సమయంలోనే విజయ్ దళపతి ఏకంగా తమిళనాడుకి ముఖ్యమంత్రిగా అవతరించారు. ఈ నేపథ్యంలోనే ఇటు టాలీవుడ్ లో కూడా అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు అల్లు అర్జున్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన మేనేజర్ ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై మేనేజర్ క్లారిటీ..

గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ తన మావయ్య లాగే రాజకీయాల్లోకి వస్తారని.. ప్రముఖ పార్టీలో చేరతారంటూ వార్తలు రాగా.. ఈ పొలిటికల్ వార్తలపై ఆయన టీం నుంచి కానీ, అల్లు కాంపౌండ్ నుంచి కానీ ఒకప్పుడు ఎలాంటి స్పందన రాలేదు. కానీ తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై క్లారిటీ వచ్చేసింది.. ఈ మేరకు శరత్ చంద్ర నాయుడు మాట్లాడుతూ.. “నేను ఒక వార్తకు సోషల్ మీడియాలో నేరుగా రిప్లై ఇచ్చాను. అవన్నీ ఫేక్ న్యూస్.. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. అలాంటి ఆయన ఇప్పుడు కరెంట్ లైనప్ లో ఉన్న సినిమాలు వదిలేసి.. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? అసలు రావాల్సిన అవసరం కూడా ఏముంది ? ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది.

మరో 10 ఏళ్లు పిక్స్..

Advertisement

ఇండియాలో ఆయన చాలా పెద్ద స్టార్.. వాళ్ల మామయ్య ద్వారా వస్తారు అనే వార్తలన్నీ కూడా అవాస్తవం.. ముఖ్యంగా అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలకు మరో 10 సంవత్సరాల పాటు ఆయన చాలా బిజీగా ఉంటారు. అవన్నీ వదిలేసి ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు.. దయచేసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ వస్తారు అనే వార్తలను ఎవరూ నమ్మకండి.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే” అంటూ శరత్ చంద్ర నాయుడు క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికైతే బన్నీ మరో పదేళ్లు తన సినిమాలను బుక్ చేసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

alsao read:జననాయగన్.. లాస్ట్ క్లిప్..థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడియన్స్!

అల్లు అర్జున్ సినిమాలు..

Advertisement

అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలతో భారీ వీఎఫ్ఎక్స్ తో రాబోతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి . పైగా ఈ చిత్రాన్ని కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ వార్తలకు చెక్ పడింది అని చెప్పవచ్చు.

Related News

సినిమా ఫ్లాప్ అయితే గుండు కొట్టించుకుంటా – జబర్దస్త్ కమెడియన్!

2,100 కోట్ల బడ్జెట్… 91 రోజుల్లో షూటింగ్.. ‘ది ఒడిస్సీ’ మైండ్ బ్లాకింగ్ ఫ్యాక్ట్స్!

‘వారణాసి’ డీల్ సక్సెస్..ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా టైటిల్ !

30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్!

ఒకే హీరోకి కూతురిగా, లవర్‌గా, తల్లిగా నటించిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?

జననాయగన్.. లాస్ట్ క్లిప్..థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడియన్స్!

జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ఆసక్తికర విషయాలు బయటకు!

Big Stories

Advertisement
×