E-Paper
Advertisement

పేపర్ లీక్ నిరసనలతో దేశం దద్దరిల్లుతున్న వేళ వివాదాస్పద సిరీస్… టైమ్ చూసి కొడుతున్న జీ5 ఓటీటీ

పేపర్ లీక్ నిరసనలతో దేశం దద్దరిల్లుతున్న వేళ వివాదాస్పద సిరీస్… టైమ్ చూసి కొడుతున్న జీ5 ఓటీటీ
Advertisement

The Scam Leaked OTT: పేపర్ లీక్ అంశం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి టైమ్ లో సడన్ గా ఊడిపడింది ఒక టీజర్. ఇదే వివాదాస్పద అంశం ఆధారంగా ఆ సిరీస్ తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా, సడన్ గా టీజర్ వదిలి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. తాజాగా వచ్చిన The Scam – Leaked వెబ్ సిరీస్ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జీ5 అనౌన్స్మెంట్

పేపర్ లీక్ అయితే ఏం జరుగుతుంది ? ఒక పరీక్ష రద్దు అవుతుంది అంతే అనుకుంటున్నారా ? కానే కాదు… ఆ ఒక్క లీక్ వెనుక దాగిన కుట్రలు, అధికారుల లాభాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, కుటుంబాల ఆవేదనలు… ఇవన్నీ కలిసి ఒక సామాజిక వినాశనాన్ని సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో ZEE5 సంచలనాత్మక కాన్సెప్ట్‌తో ‘ది స్కామ్ – లీక్డ్’ (The Scam – Leaked) అనే హిందీ వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పరీక్ష లీకేజీ అవకతవకలను ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ కథను రూపొందిస్తున్నారు.

టీజర్లోనే దిమ్మతిరిగే సీన్స్

Advertisement

హై-సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో కట్టుదిట్టమైన నిఘా మధ్య మెడికల్ క్వశ్చన్ పేపర్లు ప్రింట్ అవుతున్న సీన్స్, వాటిని ‘కాన్ఫిడెన్షియల్’ ట్యాగ్‌లతో బాక్సుల్లో సీల్ చేయడం… వంటి సీన్లతో టీజర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ బాక్సులు పరీక్షా కేంద్రాలకు తరలించే వాహనాల్లోకి ఎక్కకముందే, సిస్టమ్‌లోని ఒక వ్యక్తి అత్యంత సీక్రెట్‌గా ఫోన్‌లో ఫోటో తీసి ఆ పేపర్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తాడు. ఈ ఒక్క లీక్ వల్ల లక్షలాది మంది విద్యార్థుల కలలు రోడ్డున పడతాయి. టీజర్ ముగింపు షాట్ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒక ఖాళీ క్లాస్‌రూమ్‌లో విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, టేబుల్ మీద ఉన్న ఫోన్‌లో ‘పాపా కాలింగ్’ అని స్క్రీన్ వెలుగుతుంది. ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరి కళ్లు కన్నీళ్లతో నిండిపోతాయి.

డిలీట్ చేయకముందే రిలీజ్ చేయండి

ఈ సిరీస్ ఒక పేపర్ లీకేజీ కథ కాదు, దేశంలోని విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను, పెద్దల లాభాల కోసం జరిగే కుట్రలను, విద్యార్థుల మానసిక ఒత్తిడిని, కుటుంబాల ఆవేదనను హార్ట్ టచింగ్‌గా చూపించే గ్రిప్పింగ్ స్టోరీ. ఒక్క పేపర్ లీక్ కావడం వల్ల లక్షలాది మంది టాలెంటెడ్ విద్యార్థుల భవిష్యత్తు ఎలా నాశనమవుతుంది ? దీని వెనుక ఉన్న పెద్దల హస్తం, కరప్షన్ నెట్‌వర్క్ ఏమిటి ? మానసిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు, వారి కుటుంబాల ఆవేదనను ఈ సిరీస్‌లో హార్ట్ టచింగ్‌గా చూపించబోతున్నారు.

Advertisement

“ఒకే ఒక్క పేపర్.. లక్షలాది కలలు.. ఒకే ఒక్క లీక్.. దేశం మొత్తం ఆశ్చర్యంలో” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ కథ రాబోతోంది. ZEE5 తన కొత్త మల్టీలింగ్వల్ స్లేట్‌లో భాగంగా ఈ సిరీస్‌ను ప్రకటించింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. టీజర్ విడుదలతోనే ‘కమింగ్ సూన్’ అని ప్రకటించారు. అధికారిక స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. నటీనటులు, దర్శకుడి వివరాలను సస్పెన్స్‌లో ఉంచారు. ఇటీవల విడుదలైన రెండు రోజులకే పంజాబీ చిత్రం ‘సట్లజ్’ (Satluj)ను జీ5 డిలీట్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ సిరీస్ ను అయినా డిలీట్ చేయమనే లోపే రిలీజ్ చేయండి అంటూ నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు.

Read Also: సమయాన్ని దొంగిలించే శక్తులు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ క్రియేటర్స్ మరో మాస్టర్ పీస్

Tags

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×