E-Paper
Advertisement

‘ఎల్లమ్మ’ సినిమాతో యక్షగానానికి మళ్లీ మంచి రోజులు వస్తాయా?

‘ఎల్లమ్మ’ సినిమాతో యక్షగానానికి మళ్లీ మంచి రోజులు వస్తాయా?
Advertisement

Jabardasth Rajamouli:జబర్దస్త్ రాజమౌళి..ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షోతో పాటు ఎన్నో సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఈయన లైఫ్ లో చాలామందికి తెలియని విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబానికి యక్షగాన కళతో విడదీయలేని అనుబంధం ఉంది కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి.. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా గురించి ఆసక్తికర విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు.

యక్షగాన కళాకారుల కుటుంబం నుంచి 

Advertisement

రాజమౌళి కుటుంబంలో చాలామంది యక్షగాన కళాకారులు ఉన్నారట.తన తండ్రి కూడా ఊరూరూ తిరుగుతూ యక్షగాన ప్రదర్శనలు ఇచ్చేవారట. ఒకప్పుడు రూ.15, రూ.20 రూపాయలకే ప్రదర్శనలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.

యక్షగానం అంటే ఇప్పటి జనరేషన్‌లో చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ కళ అంటే చాలా ఫేమస్. మహాభారతం, రామాయణం, హరిశ్చంద్రుడు, అల్లిరాణి వంటి ఎన్నో కథలను పాటలు, పద్యాలు, నటనతో ప్రేక్షకులకు చూపించేవారు. కానీ కాలం మారడంతో ఈ కళకు ఆదరణ తగ్గిపోయింది. కళను నమ్ముకుని బతికిన కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని వాపోయాడు.

Advertisement

వేణు యెల్దండిని అభినందించిన రాజమౌళి

ఇక దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా యక్షగాన కళాకారుల జీవితాల బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలిపాడు. ఇలాంటి కళాకారుల జీవితాలు ఎలా ఉండేవి? వాళ్లు తమ కుటుంబాలను ఎలా పోషించుకునేవారు? ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్న కళకు ఇప్పుడు ఆదరణ ఎందుకు తగ్గింది? అనే విషయాలను సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పబోతున్నాడు అంటూ ఎల్లమ్మ గురించి వివరించాడు. వేణు యెల్దండి ఇలాంటి కథను సెలెక్ట్ చేసుకోవడం మెచ్చుకోతగ్గ విషయమని ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని తాము కూడా ఎదురుచూస్తున్నామని తెలిపాడు.

పేదరికం మధ్య చదువు

ఇక యక్షగాన కళాకారుల కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, చదువుకోవడానికే కాదు , కొన్ని సందర్భాల్లో తినడానికి కూడా డబ్బులు లేవని బాధపడ్డాడు.అయితే తన జీవితంలో కొంతమందిచేసిన సహాయాన్ని ఆయన ఎప్పటికీ మర్చిపోలేనని ముఖ్యంగా రామరెడ్డి సార్ తన చదువుకు ఎంతో అండగా నిలిచారని తెలిపాడు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, బీఈడీ వరకు చదువుకోవడానికి సహాయం చేశారని గుర్తుచేసుకున్నాడు. నారాయణ సార్, నరేష్ కుమార్ సార్ వంటి వారు కూడా తన చదువు కొనసాగడానికి తోడ్పడ్డారని చెప్పాడుకుటుంబం యక్షగాన ప్రదర్శనల కోసం ఊర్లు తిరిగే పరిస్థితుల్లో తన చదువు ఆగిపోకుండా ఎంతోమంది సహాయం చేశారని రాజమౌళి వివరించారు. వాళ్ల ప్రోత్సాహంతోనే చదువును పూర్తి చేయగలిగానని తెలిపాడు.

టీచర్ కావాలనుకున్నారు.. కానీ 

తాను బీఈడీ పూర్తి చేసి కొంతకాలం టీచర్‌గా కూడా పనిచేశానని . కానీ ఆ తర్వాత నటన వైపు అడుగులు వేశానని తెలిపాడు.ఇక కాలేజీ రోజుల్లోనే తనలోని నటనను బయటపెట్టేవాడినని ఆస్నేహితుల దగ్గర అమాయకుడిలా నటించడం, తాగిన వాడిగా వారిని భయపెట్టడం వంటివి చేసేవాడినని గుర్తుచేసుకున్నాడు.మొత్తానికి జబర్దస్త్ రాజమౌళి ఇంటర్వ్యూలో‘ఎల్లమ్మ’ సినిమాపై చేసిన కామెంట్స్ ఇపుడు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.చూడాలి మరి వేణు ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో !’

ALSO READ :సిసింద్రీలో రమ్యకృష్ణను ఎందుకు తీసేశారు? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

Tags

Related News

రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

కళే నా ప్రాణం.. కానీ నన్నే మోసం చేశారు.. గరివిడి లక్ష్మి కన్నీటి కథ!

హే యూ అంటూ హీట్ పెంచేసిన అనుపమ.. లుక్ మామూలుగా లేదుగా!

వెంకటేష్ తో కలసి స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతి!

సిసింద్రీలో రమ్యకృష్ణను ఎందుకు తీసేశారు? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

విశ్వక్ సేన్ ఇంత రిస్క్ చేశాడా? ‘కల్ట్’ వెనుక అసలు కథ!

ఆ హీరో నా లక్కీచార్మ్.. సమంత కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×