Sisindri Movie:‘సిసింద్రీ’..అఖిల్ అక్కినేని చైల్డ్ ఆరిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో మనం చూడని కొన్ని సీన్లు ఉన్నాయని, ముఖ్యంగా రమ్యకృష్ణతో కలిసి నాగార్జునపై ఓ ప్రత్యేకమైన ట్రాక్‌ను ప్లాన్ చేశామని దర్శకుడు శివ నాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
రమ్యకృష్ణ కోసం ప్రత్యేకమైన కథ
‘సిసింద్రీ’ సినిమా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో దర్శకుడు శివ నాగేశ్వరరావు, రచయిత జనార్దన మహర్షి కలిసి రమ్యకృష్ణ పాత్ర కోసం ఓ ప్రత్యేకమైన ట్రాక్‌ను సిద్ధం చేశారట. ఇందులో రమ్యకృష్ణ ఒక రిచ్ లేడీగా గా కనిపించాల్సి ఉందట. ఇక నాగార్జున మెకానిక్‌గా, శుభలేఖ సుధాకర్ ఆయన అసిస్టెంట్‌గా ఉండేలా సీన్స్ ప్లాన్ చేశారట కూడా.
ఇక స్టోరీ ప్రకారం, రమ్యకృష్ణ డ్రైవ్ చేస్తున్నకాస్ట్లీ కారు మధ్యలో ఆగిపోవడంతో దగ్గర్లో ఉన్న మెకానిక్ షెడ్‌కు వెళ్లిన ఆమె, తన కారుని రిపేర్ చేయమని చెబుతుంది. రిపేర్ పూర్తయ్యాక కారును ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని, డబ్బులు కూడా అక్కడే తీసుకోవాలని చెప్పి వెళ్లిపోతుంది.అయితే కారులో అఖిల్ ని చూసిన నాగార్జున తన బిడ్డను పట్టించుకోకుండా వెళ్లిపోయిందని అనుకుని ఆ తర్వాత కారును తీసుకుని అఖిల్‌తో కలిసి రమ్యకృష్ణ ఇంటికి వెళ్తాడట నాగ్.
పెళ్లిచూపుల దగ్గర అసలు ట్విస్ట్!
ఇక నాగార్జున అక్కడికి వెళ్లేసరికి రమ్యకృష్ణకు పెళ్లిచూపులు జరుగుతుంటాయి. ఆమె పెళ్లికూతురిగా రెడీ అయి ఉంటుంది. ఇంతలో అఖిల్‌ను తీసుకుని అక్కడికి వెళ్లిన నాగార్జున.. ఈ పిల్లవాడు పెళ్లికూతురి కొడుకని చెప్పి అక్కడున్నవారికి షాక్ ఇస్తాడట. దీంతో పెళ్లిచూపులు ఆగిపోతాయి.ఇక ఆ తర్వాత రమ్యకృష్ణ, నాగార్జున మధ్య ఐదారు సీన్స్ ఉండేలా కథను రెడీ చేశారట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం, చివరకు ఓ డ్యూయెట్ కూడా ఉండేలా ప్లాన్ చేశామని శివ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.
ఇక ఈ ట్రాక్‌ను దర్శకుడితో పాటు అక్కడున్న కొందరు బాగా ఎంజాయ్ చేశారట. అయితే నాగార్జున షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సీన్స్ గురించి చెప్పగా, ఆయనకు మాత్రం ఆ ట్రాక్ నచ్చలేదని దర్శకుడు గుర్తుచేసుకున్నారు.
నాగార్జున ఎందుకు వద్దన్నారు?
ఈ ట్రాక్ చాలా మాస్‌గా ఉందని, ‘సిసింద్రీ’ సినిమాను మరింత స్టైలిష్‌గా, క్లాస్‌గా తీసుకెళ్తే బాగుంటుందని నాగార్జున అభిప్రాయపడ్డారట. దీంతో దర్శకుడు శివ నాగేశ్వరరావు తన ఆలోచనను వివరించినప్పటికీ, నాగార్జున మాత్రం ఆ ట్రాక్‌ను వద్దని చెప్పారట. అఖిల్ కారణంగా హీరో, హీరోయిన్ కలవడం కథకు బాగుంటుందని దర్శకుడు అనుకున్నప్పటికీ, చివరకు నాగార్జున డిసీషన్ కి అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు.
కోట శ్రీనివాసరావు కామెడీ ట్రాక్ కూడా కట్!
ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ. కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో ‘రోషన్’ అనే ఎన్నికల అధికారిగా కనిపించేలా ఓ కామెడీ ట్రాక్‌ను డిజైన్ చేశారట. జైలులో ఖైదీలు యూనియన్ ఏర్పాటు చేసుకుని ఎన్నికలు నిర్వహించాలనుకోవడం, ఆ ఎన్నికలను నిర్వహించడానికి రోషన్ రావడం ఈ ట్రాక్ లో ప్లాన్ చేశామని తెలిపారు.అయితే లెంత్ ఎక్కువ కావడంతో కట్ చేశామని చెప్పుకొచ్చాడు.మొత్తానికి సిసింద్రీలో రమ్యకృష్ణ ఎందుకు లేదో దర్శకుడు శివ నాగేశ్వరరావు చెప్పడం ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ :విశ్వక్ సేన్ ఇంత రిస్క్ చేశాడా? ‘కల్ట్’ వెనుక అసలు కథ!