Jabardasth Rajamouli : వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా ఎదగాలి అంటే సపోర్టు లేకపోతే తొక్కేస్తారు అనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు బలమైన సపోర్టు లేకపోవడం వల్లే.. ఆ ఇద్దరు తన కెరీర్ ను నాశనం చేశారని, తనకు అవకాశం రాకుండా తొక్కేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జబర్దస్త్ రాజమౌళి (Jabardasth Rajamouli). బిగ్గెస్ట్ కామెడీ షోగా గత దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ కామెడీ షో ఎంతోమంది ప్రతిభ ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వేదిక అవ్వడమే కాకుండా ఎంతో మందికి జీవితాన్ని అందించింది. ఈ షోలో పాల్గొన్న ఎంతోమంది కమెడియన్లు ఇప్పుడు దర్శకులుగా , హీరోలుగా సినిమాలలో కూడా చలామణి అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
ముఖ్యంగా ఒకప్పుడు కంటెస్టెంట్లుగా, టీం లీడర్లుగా చేసిన వారు ఇప్పుడు సినిమాలలో కొనసాగుతూ మరింత బిజీగా మారిపోగా.. తనకు మాత్రం అవకాశాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జబర్దస్త్ రాజమౌళి. ముఖ్యంగా తాగుబోతు పాత్రలతో ఈయన చేసే స్కిట్లు బుల్లితెర ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. అంతేకాదు పాటలను కూడా పేరడీ పాటలుగా పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ ఇంటర్వ్యూలో భాగంగా జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ..” నాకు నటన అంటే చాలా ఇష్టం. పైగా తాగుబోతులా నటించడం అంటే మరింత ఇష్టం. ఇలా కాలేజీ రోజుల నుంచే నేను నటించేవాడిని. కొన్నిసార్లు నిజంగా తాగేసి వచ్చాను అనుకోని నన్ను స్టేజిపై నుంచి దింపేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారానే నాకు మంచి పేరు లభించింది. నా టాలెంట్ చూసి నాతో పాటు జీవన్ ని కూడా కలిపి ఒకసారి టీం లీడర్స్ ను చేశారు మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి. దీంతో ఆనందంతో అందరికీ స్వీట్లు కూడా పంచాము. అప్పటికి మేము కిర్రాక్ ఆర్పి టీం లో ఉండే వాళ్ళం. ఇక జీవన్ వెంకీ మంకీ టీం లో కంటెస్టెంట్ గా ఉండేవాడు.
మాకు టీం లీడర్ ఇచ్చారని తెలిసి ఆర్పీ , వెంకీ డైరెక్టర్స్ దగ్గరకు వెళ్లి వాళ్లకు టీం లీడర్గా అవకాశం ఇస్తే మా టీమ్స్ వీక్ అయిపోతాయి. మాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ దొరికే వరకు వారికి ఆ ఛాన్స్ ఇవ్వొద్దు అన్నారు. దాంతో మా టీం లీడర్ పొజిషన్ ని కాస్త ఆపేశారు. అందుకే బలమైన సపోర్టు లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేము. అలా వాళ్ళిద్దరి వల్ల మళ్ళీ మేము అవకాశాలు లేకుండా ఇబ్బంది పడ్డాము. అంటూ ఎమోషనల్ అయ్యారు జబర్దస్త్ రాజమౌళి. ఇకపోతే నాగబాబు వెళ్లిపోయిన తర్వాత అవకాశం ఇచ్చినా ఆ సమయంలో తన ఆరోగ్యం బాగాలేక ఆ అవకాశాన్ని వద్దనుకున్నారట. ఏది ఏమైనా జబర్దస్త్ రాజమౌళి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా .మారుతున్నాయి.
also read:Tollywood: సమ్మక్క సారలమ్మ జాతరలో హీరోయిన్ అణుచిత ప్రవర్తన.. నెటిజన్స్ మండిపాటు
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==