Tollywood: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ వారు చేసే పనుల వల్ల సోషల్ మీడియాలో నెగెటివిటీని మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. మరికొంతమంది చేసే పనులు కరెక్ట్ అయినప్పటికీ కూడా ఇలా విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక టాలీవుడ్ హీరోయిన్ సమ్మక్క సారలక్క జాతరలో చేసిన పనికి ఇప్పుడు విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పవచ్చు. మరి ఆమె ఎవరు? అసలు ఏం చేసింది? ఎందుకు ఆమెపై నెగెటివిటీ పెరిగిపోతుంది? ట్రోల్స్ రావడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కమిటీ కుర్రోళ్ళు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు అమ్మాయి టీనా శ్రావ్య(Teena Sravya).ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. తెలంగాణలో అత్యంత పవిత్రంగా దైవభక్తితో పూజించే సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరున్న ఈ దేవాలయానికి ఇప్పటినుంచే జనాలు పోటెత్తుతున్నారు .ముఖ్యంగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా సమ్మక్క సారలమ్మ దేవతలు వెలిశారు. అందుకే ఈ దేవతలకు బంగారంగా భావిస్తూ బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఎవరైతే మొక్కుబడి ఉంటారో వారంతా తమ బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
అంతాబాగానే ఉన్నా ఇక్కడ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను ఆ బెల్లం తక్కెడలో కూర్చోబెట్టి.. దాని బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పిస్తున్నట్లుగా టీనా శ్రావ్య తల్లి సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక వీడియో ఇప్పుడు పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది సమ్మక్క సారలమ్మ దేవతలను అవమానించేలా ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆమెపై మండిపడుతున్నారు.
అయితే దీనిపై స్పందించిన టీనా శ్రావ్య తల్లి మాత్రం మేము దేవతలను అవమానించడం లేదు. మా కుక్కకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. మా పెంపుడు కుక్క తిరిగి ఆరోగ్యంగా కోలుకుంటే.. అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి బంగారం ఇచ్చుకుంటామని మొక్కుకున్నాము. సర్జరీ అయ్యాక కోలుకుంది. అందుకే ఇప్పుడు బంగారాన్ని మేము సమర్పిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలియక కొంతమంది ఫూల్స్ లా ప్రవర్తిస్తున్నారని ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అమ్మవారికి బెల్లాన్ని సమర్పించినప్పుడు అక్కడ ఉన్నది మనిషా జంతువా అనే తారతమ్యం చూడకూడదు. మొక్కుబడి ఉన్నప్పుడు ఎవరికైనా సరే మొక్కు చెల్లించాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం మీరు తెలంగాణ దేవతను అవమానిస్తున్నారు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేయండి అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు ద్వంద ధోరణిలో వైరల్ అవుతోంది.మరి టీనా శ్రావ్య తల్లి ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచుతారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
also read:Nayanthara: జాక్ పాట్ కొట్టిన నయనతార.. ఏడాది మొత్తం ఆమెదే హవా!
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==