E-Paper
Advertisement

Lizelle Lee OUT: స్టంప్ ఔట్ పై వివాదం..ఢిల్లీ ప్లేయ‌ర్ లిజెల్ లీపై ఐసీసీ వేటు,భారీ ఫైన్‌

Lizelle Lee OUT: స్టంప్ ఔట్ పై వివాదం..ఢిల్లీ ప్లేయ‌ర్ లిజెల్ లీపై ఐసీసీ వేటు,భారీ ఫైన్‌
Advertisement

Lizelle Lee OUT:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 13 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా 5 మ్యాచ్ లు విజయం సాధించి ప్లే ఆఫ్ కు కూడా వెళ్ళింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొత్తగా చేరిన లిజెల్ లీ ( Lizelle Lee ) పైన వేటు వేసింది ఐసీసీ. ఆమెపై 10% మ్యాచ్ ఫీజు కోత విధించాలని ఆదేశాలు ఇచ్చింది ఐసీసీ. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా తొలగించింది. ఈ మేరకు ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అంపైర్ తో గొడవ పెట్టుకుంది లిజెల్ లీ. దీంతో ఈ ఫైన్ విధించింది ఐసీసీ.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

అసలు లిజెల్ లీ వివాదం ఏంటి.. ఐసీసీ ఫైనల్ ఎందుకు వేసిందంటే ?

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య వడోదర వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించిన ఢిల్లీ ప్లేయర్ లిజెల్ లీ ( Lizelle Lee ) వివాదాస్పదంగా స్టంప్ ఔట్ అయ్యారు. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 11వ ఓవర్ వేసింది ముంబైకి చెందిన అమన్ జ్యోత్ కౌర్. అయితే ఆ ఓవర్ లో ఓ వైడ్ బంతిని ఆడే ప్రయత్నం చేసింది ఢిల్లీ ప్లేయర్ లిజెల్ లీ. కానీ ఆ బంతి మిస్ కావడంతో స్టంప్ ఔట్ చేసింది రహీలా ఫిర్దౌస్. దీంతో లిజెల్ లీ స్టంప్ ఔట్ అయినట్లు థర్డ్ ఎంపైర్ ప్రకటించాడు. అయితే తాను బ్యాట్ పెట్టానని, అంతకు ముందే తన కాలు క్రీజ్ లోనే ఉందని.. ఫీల్డ్ అంపైర్ తో గొడవ పెట్టుకుంది ఢిల్లీ ప్లేయర్ లిజెల్ లీ. అయినప్పటికీ థర్డ్ ఎంపైర్ నిర్ణయం కారణంగా పెవిలియన్ ను వదిలింది. అప్పటికే 28 బంతుల్లో 46 పరుగులు చేసింది లిజెల్ లీ. అర్థ సెంచరీ మిస్ కావడంతో తీవ్ర నిరాశకు గురై.. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయింది లిజెల్ లీ. ఈ సంఘటన వైరల్ గా మారింది.

లిజెల్ లీపై భారీ ఫైన్ వేసిన ఐసీసీ

స్టంప్ ఔట్ వివాదం నేప‌థ్యంలో థర్డ్ అంపైర్ చెప్పినప్పటికీ ఢిల్లీ ప్లేయర్ లిజెల్ లీ గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ సీరియస్ అయింది. కోడ్ ఆఫ్ కండక్ట్ బ్రేక్ చేసిన ఆమెపై మ్యాచ్ ఫీజులో 10% ఫైన్, ఒక డీ-మెరిట్ పాయింట్ తొలగించింది ఐసీసీ.

Advertisement

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

 

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×