E-Paper
Advertisement

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

రికార్డుల వేటలో  ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?
Advertisement

Odyssey BoxOffice: కరోనా తర్వాత కాలం మారింది, OTT ల ఎటాక్ తో థియేటర్లలోకి జనాలు అస్సలు రావట్లేదు..ఇదీ గత కొంతకాలంగా మేకర్స్ చేస్తున్న ఎలిగేషన్.కానీ.అబ్బే సరైన కంటెంట్ ఇస్తే ఎందుకు రామంటూ తాజాగా వచ్చిన ‘అబ్సెషన్’కి కోట్ల వర్షం కురిపించి వారి ఆరోపణలని ఇప్పటికే తప్పని ప్రూవ్ చేశారు ఆడియన్స్.

ఇక ఇదే క్రమంలో తాజాగా హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ‘ది ఒడిస్సీ’ని మరోసారి అక్కున చేర్చుకొని థియేటర్లకి రావడానికి మాకు ఎలాంటి సమస్య లేదు కావాల్సిందల్లా కంటెంట్ మాత్రమే అంటూ మరోసారి కాసుల వర్షం కురిపించారు ఆడియన్స్.అది కూడా అలా ఇలా కాదండోయ్ ..రిలీజ్ అయిన తొలి మూడు రోజుల్లోనే ఒక్క ఇండియాలోనే రూ. 73.19 కోట్ల గ్రాస్ (రూ. 61.30 కోట్ల నెట్) వసూళ్లు కొల్లగొట్టి ఆల్-టైమ్ రికార్డు సాధించేంత.

Advertisement

తొలిరోజే రూ. 20.75 కోట్ల గ్రాస్‌

అవును ..శుక్రవారం రూ. 17.40 కోట్ల నెట్‌తో మొదలైన ఈ సినిమా శనివారానికి రూ. 22 కోట్లకు చేరింది. ఇక ఆదివారం అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ ఏకంగా రూ. 21.90 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం.
రోజులు గడుస్తున్నా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిచట్లేదంటే సినిమా ఆడియన్స్ ని ఎంతగా అలరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు …దీనికి ముందు నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒపెన్‌హైమర్’ తొలిరోజు వసూలు చేసిన రూ. 17.50 కోట్ల గ్రాస్ రికార్డును, ఈ కొత్త చిత్రం తొలిరోజే రూ. 20.75 కోట్ల గ్రాస్‌తో క్రాస్ చేయడం గమనార్హం.

Advertisement

also read:‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

ఒక్క ఇంగ్లీష్ వెర్షన్ నుంచే ఇండియాలో దాదాపు రూ. 48.5 కోట్లు కొల్లగొట్టగా, మేమూ తక్కువ కాదంటూ హిందీ, తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్స్ కూడా కాసుల వర్షం కురిపించడం విశేషం.ఒకరకంగా ఇండియాలో ‘టెనెట్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డంకిర్క్’ రికార్డులన్నీఈ సినిమా తుడిచిపెట్టేసినట్టే అని చెప్పాలి.

ఫస్ట్ వీక్ లోనే ఏకంగా 264 మిలియన్ డాలర్లకు పైగా

ఇక ఇండియాలోనే దీని స్టామినా ఇలా ఉందంటే వరల్డ్ వైడ్ గా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో 124.5 మిలియన్ డాలర్లు, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 139.6 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ఒడిస్సీ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ లోనే ఏకంగా 264 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 2,546 కోట్లు) వసూళ్లు రాబట్టిందంటే ముందు ముందు ఇంకెన్ని కాసులు కొల్లగొడుతుందో ఊహించుకోవచ్చు. ఇక 2012లో వచ్చిన ‘ది డార్క్ నైట్ రైజెస్’ తర్వాత నోలన్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద గ్లోబల్ ఓపెనింగ్ అని బాక్సాఫీస్ రికార్డ్స్ చెబుతున్నాయ్.

ఇక సినిమా విషయానికి వస్తే హోమర్ రచించిన పురాతన గ్రీకు ఇతిహాసం ఆధారంగా విజువల్ వండర్‌గా వచ్చిన ఈ చిత్రంలో మ్యాట్ డామన్ (ఒడిస్సియస్ రాజు), టామ్ హాలండ్ (కుమారుడు టెలిమాకస్) ప్రధాన పాత్రల్లో జీవించారు.ఈ చిత్రానికి మరింత గ్లామర్ తేవడంతో పాటు సినిమా సక్సెస్ కి ఆన్ హత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లిజ్ థెరాన్, జెండయా, లూపిటా నియోంగో వంటి స్టార్ కాస్ట్ కూడా కీ రోల్ పోషించిందని చెప్పాలి.

ముందు ముందు మేకర్స్ ఏమైనా కళ్ళు తెరుస్తారో

ఏది ఏమైనా సినిమా బాక్సాఫీస్ వద్ద శివ తాండవం చేస్తున్న తీరుని చూసైనా మన మేకర్స్ తీరుని మార్చుకుంటే మంచింది.అలా కాకుండా జనాలు థియేటర్స్ కి అసలే రావట్లేదు అంటూ నెపాన్ని ఆడియన్స్ పై నెట్టేసి అదే రొడ్ద కొట్టుడు సినిమాలు తీసుకుంటూ పొతే మాత్రం జనాలు మన సినిమాలని బ్యాన్ చేయడం ఖాయం. చూడాలి ముందు ముందు మేకర్స్ ఏమైనా కళ్ళు తెరుస్తారో !

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×