E-Paper
Advertisement

ప్రభాస్ పెద్ద మనసును గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన జగపతి బాబు!.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ పెద్ద మనసును గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన జగపతి బాబు!.. ఏం జరిగిందంటే?
Advertisement

Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్, మరియు టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళిలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తాను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్న సమయంలో ప్రభాస్ తనకు ఎలా అండగా నిలబడ్డారో గుర్తుచేసుకుని జగపతి బాబు ఎమోషనల్ అయ్యారు.

Read also-డైరెక్టర్ పవన్ సాధినేనికి బర్త్‌డే విషెస్.. ‘ఆకాశంలో ఒక తార’ మేకర్స్ క్రేజీ పోస్ట్ వైరల్!

ఆ కష్ట కాలంలో ‘డార్లింగ్’ ఇచ్చిన భరోసా

Advertisement

ఒకానొక దశలో తాను తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ను ఎదుర్కొన్నట్లు జగపతి బాబు వెల్లడించారు. ఆ సమయంలో ఆవేదన తట్టుకోలేక, తనకు ఎంతో నమ్మకమైన వ్యక్తి అయిన ప్రభాస్‌కు ఫోన్ చేసినట్లు చెప్పారు. అప్పటికే ప్రభాస్ జార్జియాలో ఒక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, జగపతి బాబు ఫోన్ చేయగానే ఎంతో ఆప్యాయంగా మాట్లాడారట. “డార్లింగ్, నేను ఉన్నాను. నువ్వేం భయపడకు.. నీ సమస్య ఏంటో చెప్పు, నేను చూసుకుంటాను” అంటూ ప్రభాస్ ఇచ్చిన భరోసా తనలో కొత్త ధైర్యాన్ని నింపిందని జగపతి బాబు పేర్కొన్నారు.

అంతేకాదు, విదేశాల నుండి షూటింగ్ పూర్తి చేసుకుని రాగానే ప్రభాస్ వ్యక్తిగతంగా జగపతి బాబును కలిసి, ఆ డిప్రెషన్ నుండి బయటపడటానికి ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. వయసులో చిన్నవాడైనప్పటికీ ప్రభాస్‌కు ఉన్న పెద్ద మనసు, ఎటువంటి స్వార్థం లేని గుణం ఇండస్ట్రీలో ఎవరికీ ఉండవని ఆయన కొనియాడారు.

రాజమౌళి ఫ్యామిలీపై ప్రశంసలు

Advertisement

ఇదే ఇంటర్వ్యూలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి కూడా జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా సరే.. రాజమౌళికి అస్సలు ‘ఈగో’ ఉండదని అన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా ఎంతో వినమ్రంగా ఉంటారని, ఎవరినైనా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని చెప్పారు. ఇక రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి చెబుతూ.. “రాజమౌళికి స్నేహితులు, బంధుత్వాల కంటే సినిమానే ముఖ్యం. కథలోని పాత్రకు ఎవరు సెట్ అవుతారో, ఎంత పెద్ద స్టార్ అయినా.. చిన్న నటుడైనా సరే వారిని మాత్రమే తీసుకుంటారు. ఆయన ప్రొఫెషనలిజమే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది” అని జగపతి బాబు ప్రశంసించారు.

Read also-This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి 19 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..

ప్రస్తుతం జగపతి బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమాలో జగపతి బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఆయన క్యారెక్టర్ లుక్ ‘అప్పలసూరి’ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×