E-Paper
Advertisement

పచ్చని సంసారంలోకి మూడో వ్యక్తి వస్తే.. ఆసక్తిగా సాగుతున్న జగపతిబాబు ‘వదలా’టీజర్!

పచ్చని సంసారంలోకి మూడో వ్యక్తి వస్తే.. ఆసక్తిగా సాగుతున్న జగపతిబాబు ‘వదలా’టీజర్!
Advertisement

Jagapathi Babu:లెజెండ్రీ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జగపతిబాబు ఒకప్పుడు తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో లేడీస్ కి ఫేవరెట్ హీరోగా మారిపోయిన ఈయన.. ఆ తర్వాత యూటర్న్ తీసుకొని విలన్ గా భయపెట్టారు. క్రూరత్వం చూపిస్తూ తనలోని విలనిజాన్ని బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అలాంటి ఈయన తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వదలా.. ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా హ్రితిక శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారు. ఆకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో తమ్మారెడ్డి భరద్వాజ, కిషోర్ నాయుడు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టీజర్ ను తాజాగా చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది.

వదలా టీజర్ ఎలా ఉందంటే?

జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటించిన వదలా సినిమా టీజర్ ఎలా ఉంది అనే విషయానికొస్తే.. జగపతిబాబు, లయ భార్యాభర్తలుగా సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. జగపతిబాబు లయను సర్వస్వంగా భావిస్తూ.. నువ్వే నా ప్రపంచం.. నువ్వు, నేను, ఈ ప్రపంచం అంతే అంటూ తన భార్యతో సంతోషంగా కొనసాగుతున్న సమయంలో మరో అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. యోగి (జగపతిబాబు)తో ఎవరు సంతోషంగా ఉన్నా సరే ఆ అమ్మాయి తట్టుకోదు ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. కట్ చేస్తే యోగిని ఏం చేయను కానీ జోలికి వచ్చిన వారి అంతు చూస్తాను అంటూ లయ కూడా అంటుంది. అలా ఒక వ్యక్తి కోసం ఇద్దరు అమ్మాయిలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా భార్య భర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను చూపించారు. ఇక ప్రస్తుతం ఈ టీజర్ ఉత్కంఠగా సాగుతోంది.. ఇక త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

జగపతిబాబు,లయ కాంబినేషన్ సినిమాల విషయానికొస్తే..

Advertisement

ఇకపోతే లయ, జగపతిబాబు కాంబినేషన్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా 2000 సంవత్సరంలో వచ్చిన మనోహరం సినిమా అయితే ఏకంగా నంది అవార్డులను సైతం అందుకుంది. తర్వాత శివరామరాజు, నాలో ఉన్న ప్రేమ, హనుమాన్ జంక్షన్ ఇలా పలు చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఇప్పుడు మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా అనేసరికి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

ALSO READ:సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అబ్బాస్ రీ ఎంట్రీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Advertisement

లయ సినిమాలు..

లయ విషయానికి వస్తే.. ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ తెలుగమ్మాయి.. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. అమెరికాలోనే ఉద్యోగం చేసుకుంటూ కెరియర్ ను కొనసాగిస్తున్న ఈమె ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా అంచనాలు అందుకోలేకపోయింది. అలాగే శివాజీ తో సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని సినిమా కూడా చేసింది.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×