E-Paper
Advertisement

పుష్ప 2 రేంజ్ హైప్.. కానీ ప్రమోషన్లు సున్నా! పెద్ది టీమ్ ప్లానింగ్ ఇంతేనా?

పుష్ప 2 రేంజ్ హైప్.. కానీ ప్రమోషన్లు సున్నా! పెద్ది టీమ్ ప్లానింగ్ ఇంతేనా?
Advertisement

Peddi Release : ఈ మధ్య కాలంలో ‘పెద్ది’ సినిమా చుట్టూ జరుగుతున్న రిలీజ్ రచ్చ మాములుగా లేదు. మార్చి 27 అని, కాదు ఏప్రిల్ 30 అని, అబ్బే కాదు కాదు జూన్ లో అని.. ఇలా ఒకదగ్గర ఆగకుండా వాయిదాల పాట పాడుతూనే ఉంది. అయితే తాజాగా డైరెక్టర్ బుచ్చి బాబు సినిమా జూన్ 25న పక్కా అన్న క్లారిటీ ఇవ్వడంతో సినిమా రిలీజ్ పై అనుమానాలు దాదాపుగా తొలిగిపోయాయ్.

ఒక పోస్టర్ కూడా వదలలేకపోయారా

Advertisement

కాని ఊరిస్తూ ఊరిస్తూ ఇలా అసలైన రిలీజ్ డేట్ రివీల్ చేసిన విధానంపైనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎన్నో సార్లు వస్తానని వెనక్కి వెళ్ళింది సినిమా. ఇపుడు తీరా అసలైన రిలీజ్ డేట్ రివీల్ చేస్తూ కనీసం అఫీషియల్ గా ఒక పోస్టర్ కూడా వదలలేకపోయారా అంటూ కామెంట్స్ వదులుతున్నారు మెగా ఫ్యాన్స్. అంత పెద్ద హీరో సినిమా డేట్ అనౌన్స్ చేయడానికి ఇలా ధనుష్ (కర) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ వాడుకోవడం ఏం బాలేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

పెద్ది జూన్ 25కి వచ్చేస్తుందని

Advertisement

మాములుగా ఇలాంటి మోస్ట్ అవైటింగ్ సినిమాల రిలీజ్ డేట్స్ ని ఒక ప్లానింగ్ ప్రకారం అనౌన్స్ చేస్తారు. కానీ అభిమానుల నుండి ప్రెజరా లేక మరొకటా తెలీదు కాని, ఉన్నపళంగా పెద్ది జూన్ 25కి వచ్చేస్తుందని పబ్లిక్ స్టేజ్ మీదే అనౌన్స్ చేసేశాడు. అంటే పెద్ది సినిమా రిలీజ్ డేట్ అంటే అంత చులకనా అన్నది ఇక్కడ చెర్రీ ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్. ఇలా మేకర్స్ ప్రమోషన్స్ పై సీరియస్ నెస్ లేకుండా ప్రవర్తించడం వల్ల, ఉన్న హైప్ అటుంచితే సినిమా మీద అసలు ఏమాత్రం సీరియస్ నెస్ ఉందో తెలిసిపోతుంది అన్న టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం సినిమా షూట్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. శృతి హాసన్ తో సాలిడ్ మాస్ నంబర్ కి స్టెప్పులేస్తున్నాడు చరణ్. మరో రెండు మూడు రోజుల్లో గుమ్మడికాయ కొట్టనుంది మూవీ టీమ్. ఇక ఈ నెల పోతే బుచ్చి బాబు చేతిలో ఉండేది కేవలం 55 రోజులు మాత్రమే. షూటింగ్ అయిపోయినప్పటికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్, ప్యాచ్ వర్క్స్, విజువల్ ఎఫెక్ట్స్ పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తుంది. మరి ఇన్ని పనులని 55 రోజుల్లో కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి వస్తామని అనడం కాస్త ఆశ్చర్యమే. క్వాలిటీలో ఏమాత్రం తేడా కొట్టినా ఫ్యాన్స్ చెడుగుడు ఆడటం ఖాయం.

రెహమాన్ అపాయింట్‌మెంట్ దొరికేనా?

ఇక వీటి సంగతి ఇలా ఉంటే, ఆస్కార్ విన్నర్ రెహమాన్ పెద్ది సినిమాకి RR (Background Score) చేసేందుకు ఇంకా డేట్స్ ఇవ్వలేదని తెలుస్తుంది. సినిమా సెకండాఫ్ కాపీ రెడీ అయ్యాక గాని రెహమాన్ పని మొదలు పెట్టడని టాక్. అంటే ఇంతటి అంచనాలు ఉన్న పెద్ది సినిమా కేవలం నెలరోజుల్లోనే RR కంప్లీట్ చేసుకోనుందన్న మాట. మరి ఇంతటి తక్కువ టైమ్ రెహమాన్ లాంటి పర్ఫెక్షనిస్ట్ కి సరిపోతుందా అంటే ఆశ్చర్యమే. ఇప్పటికే బయటికి వచ్చిన ‘చికిరి చికిరి’, ‘రైరై రారై’ పాటలు చార్ట్ బస్టర్స్ అయినప్పటికీ, అందరి టెన్షన్ అంతా సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఎలా వస్తుందనే!

నార్త్ ప్రమోషన్లు.. గాలిలో దీపమేనా?

ఇక సినిమాకేమో పుష్ప 2 స్థాయి డిమాండ్ ఉందని ఊదరగొడుతున్న మైత్రి మూవీ మేకర్స్, ప్రమోషన్స్ ని మాత్రం పట్టించుకోనట్టే కనిపిస్తుంది. సాలిడ్ కలెక్షన్స్ రావాలంటే సౌత్ తో పాటు నార్త్ కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నది స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇదే బ్యానర్ లో వచ్చిన పుష్ప 2 ఈ నార్త్ పై గురి పెట్టే 800 కోట్లు కొల్లగొట్టింది మరి. సో, చరణ్ స్టెప్పులే కాసులు కురిపిస్తాయన్న భ్రమల్లోంచి బయటికి వస్తే మంచిది.

మరో పక్క సినిమా ట్రైలర్ జూన్ మొదటి వారం దాకా రాదన్న టాక్ వినిపిస్తుంది. అంటే పెద్ది సినిమా కేవలం 20 రోజుల ప్రమోషన్స్ తోనే మ్యాజిక్ చేయాలన్న మాట. ట్రైలర్ వస్తే అంచనాలు మరింతగా పెరిగిపోతాయని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా, ప్రమోషన్స్ లో జోరు పెంచకపోతే మాత్రం బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ మెంట్ తప్పదు. మరి ఇంతటి ప్రెజర్ తట్టుకొని బుచ్చి బాబు చరణ్ కి సాలిడ్ సక్సెస్ ఇస్తాడా లేక శంకర్ బాటలో మరో ప్లాప్ అందిస్తాడా అనేది కాలమే డిసైడ్ చేయాలి.

ALSO READ :ఆమెకు బోర్ కొడితే చావాల్సిందే.. చరిత్రలో అత్యంత క్రూరమైన మహిళా కిల్లర్!

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×